Saturday, April 27, 2024
- Advertisement -

కాంగ్రెస్‌కు శ్రీహరి..తిరిగి బీఆర్ఎస్‌కు రాజయ్య?

- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం రోజుకో టర్న్ తీసుకుంటోంది. ముఖ్యంగా స్టేషన్ ఘణ్‌పూర్ రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజయ్య వర్సెస్ కడియం శ్రీహరిగా పాలిటిక్స్ రంజుగా మారాయి. వాస్తవానికి వీరిద్దరి రాజకీయంగా ఎప్పుడు ప్రత్యర్థులే. శ్రీహరి టీడీపీలో ఉంటే రాజయ్య కాంగ్రెస్. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణాల్లో వీరిద్దరూ బీఆర్ఎస్‌ గూటికి చేరినా స్వపక్షంలో విపక్షమే. ఇక 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడియంకు సీటు ఇచ్చిన కేసీఆర్..రాజయ్యను పక్కన పెట్టారు. తీరా ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు రాజయ్య. కానీ ఇంతలోనే కాంగ్రెస్‌ శ్రీహరికి పెద్దపీట వేయడంతో తిరిగి బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు రాజయ్య.

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా రాజయ్య పేరును బీఆర్ఎస్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు రాజయ్యతో సంప్రదింపులు జరపగా కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం. త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో రాజయ్య భేటీ కానున్నట్లు సమాచారం.

ఇక వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుండి కడియం కావ్య పేరు దాదాపు ఖరారైంది. ఆమె పార్టీలో చేరిన వెంటనే వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా ఎంపీ ఎన్నికలు వరంగల్‌లో రసవత్తరంగా సాగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదని ఇరు పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -