Wednesday, May 8, 2024
- Advertisement -

పార్లమెంట్ పై జాతీయ చిహ్నం.. మోడి పై విమర్శలు!

- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడి ఇటీవల కొత్త పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నన్ని ఆవిష్కరించారు. అయితే ప్రధాని పార్లమెంట్ పై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అదేంటి ? జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించడం మంచి విషయమే కదా ? మరెందుకు విమర్శలు చేస్తున్నారు అనే డౌట్ వ్యక్తం కావొచ్చు. దానికి కూడా కారణం లేకపోలేదు.. మన రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ అనేది ..ప్రభుత్వం తరుపున పని చేయదు. అదొక ఇండిపెండెంట్ వ్యవస్థ.. మన రాజ్యాంగం ప్రకారం ఎక్జిగ్యుటివ్, లెజిస్ట్రేటివ్, జ్యూడిసరి.. ఇవి మూడు స్వతంత్ర విభాగాలుగా ఉన్నాయి. ఎక్జిగ్యుటివ్ లో ప్రభుత్వం ఉంటుంది. లేజెస్ట్రేటివ్ లో పార్లమెంట్, శాసన సభలు వంటివి వస్తాయి. ఇక జ్యూడిసరి అంటే న్యాయ వ్యవస్థ.అందువల్ల ఇండిపెండెంట్ గా ఉండే ఈ వ్యవస్థలలో పార్లమెంట్ కు అధ్యక్షత స్పీకర్ వహిస్తారు. .

మరి స్పీకర్ అధ్యక్షత వహించే పార్లమెంట్ కు ఎక్జిగ్యుటివ్ వ్యవస్థలో ఉండే ప్రధాని పార్లమెంట్ పై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించడం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఆ ఆవిష్కరణ స్పీకర్ చేతులమీదుగా జరగాల్సిన ఆవిష్కరణ అంటూ విమర్శలు చేస్తున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రధాని పదవి అనేది దేశ పాలనలో అత్యున్నత పదవి. భవన నిర్మాణాలు వంటివి ప్రభుత్వం అధీనంలో ఉంటాయి. మరి ప్రభుత్వానికి ప్రాతినిథ్యం వహించే ప్రధాని పార్లమెంట్ పై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించడం తప్పు కాదు అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రధాని మోడి జాతీయ చిహ్నం ఆవిష్కరణలో మతపరమైన ప్రార్థనలు చేపట్టడాన్ని కూడా ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ప్రధాని మోడి రాజ్యాంగ విరుద్దంగా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ప్రభుత్వానికి సంభంధించిన వాటిలో మతపరమైన చర్యలు చేపట్టడం రాజ్యాంగ విరుద్దమేనంటూ విశ్లేషకులు సైతం వారి అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -