Monday, April 29, 2024
- Advertisement -

పార్లమెంట్ కు రాహుల్ నో.. జోడో వైపే మొగ్గు !

- Advertisement -

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోచ్చేందుకు ఆ పార్టీ అధిష్టానం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా దేశ ప్రజలను ఏకం చేసి ఒక్క తాటిపై నిలిపేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించిన సంగతి కుడ విధితమే. అయితే ఈ యాత్రలో రాజకీయ కోణం లేదని, కేవలం ప్రజలను ఏకం చేసేందుకే ఈ జోడో యాత్ర అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నప్పటికి.. యాత్ర తుది లక్ష్యం మాత్రం వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమేనని అందరికీ తెలిసిన బహిర్గత సత్యం. ఇక కన్య కుమారి నుంచి కాశ్మీర్ వరకు నిర్విరామంగా రాహుల్ ఈ జోడో యాత్ర కొనసాగిస్తున్నాడు. కాగా ఇప్పటివరకు జరిగిన యాత్రలో కాంగ్రెస్ ఊహించినదానికంటే ఎక్కువగానే ప్రజల నుంచి రెస్పాన్స్ వచ్చింది..

హుషారుగా రాహుల్ పాదయాత్ర చేయడం.. అలాగే స్థానికులతో కలిసిపోయి వారికి భరోసా కల్పించిస్తూ ముందుకు సాగడం ఇవన్నీ కూడా కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.మరి జోడో యాత్రలో ఇంత బిజీ బిజీగా గడుపుతున్న రాహుల్ ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరు అవుతారా లేదా ?అనే సందేహాలు చాలా మందిలో వ్యక్తమౌతున్నాయి. కాగా కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం రాహుల్ ఈసారి పార్లమెంట్ సమావేశాలకు హాజరు అయ్యే పరిస్థితి లేదట.

ఇప్పుడు ఆయన ఫోకస్ అంతా జోడో యాత్రపైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రాహుల్ తో పాటు జైరాం రమేశ్, దిగ్విజయ్ సింగ్ వంటి సీనియర్ నేతలు కూడా ఈసారి సమావేశాలకు డుమ్మా కొట్టే అవకాశం ఉందట. ప్రస్తుతం రాహుల్ చేపట్టిన జోడో యాత్ర ఆయనలో చాలా మార్పు తీసుకొచ్చిందని స్వయంగా రాహులే ఆ మద్య చెప్పుకొచ్చారు. ఈ జోడో యాత్ర ద్వారా తనలో ఓపిక, సహనం చాలా పెరిగాయని, ప్రజలతో ఎలా మమేకం అవ్వాలో తనకు తెలిసిందని రాహుల్ ఆ మద్య వ్యాఖ్యానించారు. మొత్తానికి రాహుల్ జోడో యాత్ర నిమగ్నమై పార్లమెంట్ సమావేశాలను సైతం పక్కన పెట్టేశారు. మరి వచ్చే ఎన్నికల్లో ఈ జోడో యాత్ర ప్రభావం ఎంతమేర ఉంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

బాబు, పవన్ ఇద్దరు.. జగన్నే నమ్ముకున్నారా !

చంద్రబాబు స్టైల్ మార్చింది ఆయనే!

సీమగర్జన.. మరో విశాఖగర్జన అవుతుందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -