Monday, May 20, 2024
- Advertisement -

టెంపరరీ ప్రత్యేక హోదా ?

- Advertisement -

ఏపీ ప్రజానీకానికి భావోద్వేగ అంశంగా మారిన ప్రత్యేక హోదా మంజూరుకు అవకాశమే లేదని ఇంతకాలంగా చెబుతూ వస్తున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా రాజకీయ నష్టనివారణ చర్యలకు సిద్ధమౌతున్నట్లు కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా పట్టుబడుతుండడానికి తోడు ఇటీవలనే బహిరంగంగా గళం విప్పిన జనసేన అధినేత ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ కూడా ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమౌతుండడంతో తీవ్ర ఒత్తిడికి లోనైన కేంద్రంలోని అధికార పార్టీ ప్రత్యేక హోదా గండం నుండి బయటపడేందుకు ప్రత్యామ్నాయ వ్యూహరచనపై దృష్టి సారించింది. పధ్నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆమోదంతో రెండేళ్ల క్రితం కేంద్రం – రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీ విషయంలో అమలులోకి వచ్చిన నూతన విధానంలో పెద్దగా ఒరిగేదేమీ లేకపోయినా రాష్ట్రానికి ‘నామమాత్రపు’ ప్రత్యేక కేటగిరీ రాష్ట్ర హోదాను ప్రకటించేందుకు సిద్ధమేననే సంకేతాలనివ్వడం ప్రారంభించింది.

ఇటీవల ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడుకు ఇచ్చిన హామీకి అనుగుణంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన నివాసంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ – సమాచార మంత్రి వెంకయ్యనాయుడు – టీడీపీకి చెందిన సహాయ మంత్రి సుజనా చౌదరిలతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ సమస్యలపై  సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపారు.

విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం ఆర్థికంగా తన సొంత కాళ్లపై నిలబడగలిగేలా చేయూతనివ్వడం కోసం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు పూర్వపు ప్రధాని పార్లమెంట్ కు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కూడా అమలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి పట్టుబడుతున్న విషయం తెలిసిందే.

Related

  1. లోకల్ బీజేపీ నాయకులకి సిగ్గుందా ?
  2. 48 గంటల్లో సారీ చెప్పాలి
  3. కృష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టడానికి చంద్రబాబు రెడీ ?
  4. చంద్రబాబు కి ఒళ్ళు మండే మాట

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -