Thursday, May 23, 2024
- Advertisement -

ప్రాణాలు ఫణంగా పెట్టి కూంబింగ్ చేస్తున్న టాస్క్ ఫోర్స్

- Advertisement -

ఎర్ర చందనం స్మగ్లర్ల కోసం టాస్క్ ఫోర్స్ సిబ్బంది అడవులలో కూంబింగ్ చేస్తూ పలు జంతువుల బారి నుంచి తప్పించుకుని విధి నిర్వహణ లో పాల్గొంటున్నారు. తిరుపతి తిరుమల లలో జన సంచారం ఉన్న ప్రాంతాల్లోనే పలు జంతువులు పాములు వస్తూ ఉంటాయి. ఇటీవల కపిలతీర్థం వద్ద రెండు చిరుతలు కనిపించగా ఒకటి పట్టు బడింది. మరొకటి తప్పించుకుంది. అదేవిధంగా కొండ చిలువలు కూడా ఇటీవల రోడ్డు మీదకు వచ్చాయి. ఇంకా ఏనుగులు ఇతర క్రిమి కీటకాలు సరే సరి శేషాచలం అడవులలో ఉంటాయి.

అటువంటి అడవులలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది వీటిని లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి కూంబింగ్ చేస్తుంటారు. అదీ రాత్రి సమయాలలో కేవలం టార్చ్ లైట్ల వెలుగులో తిరుగుతుంటారు. అలా తిరుగుతున్నప్పుడు ఏ జంతువైనా వీరి మీద దాడికి పాల్పడ వచ్చు. కొన్ని కీటకాలు కుడితే ప్రాణాలే పోవచ్చు. ఇటీవల ఆర్ ఎస్ ఐ విజయ్ నరసింహులు కుక్కల దొడ్డి సమీపంలోని అడవులలో కూంబింగ్ చేస్తూ మంచి నీళ్లు తాగుదామని ఒక బండపై కూర్చుని నీళ్లు తాగుతుండగా పక్కనే ఒక తాచు పాము పోతూ కనిపించింది. వెంటనే లేస్తే అది కాటు వేస్తుంది. దీంతో కదలకుండా అక్కడే కూర్చుని అది వెళ్లిన తరువాత అక్కడ నుంచి కదిలాడు. అలా పాము పక్కన కూర్చొనడానికి ఎంత గుండె ధైర్యం కావాలి. అదేవిధంగా భాకరాపేట అడవుల్లో ఎలుగుబంట్లు చిరుతలు ఎక్కువగా ఉంటాయి. ఆర్ ఎస్ ఐ భాస్కరరావు టీం శ్రీవారిమెట్టు నుంచి కూంబింగ్ ప్రారభించి వెళుతుండగా లక్ష్మీపురం టాంక్ వద్ద రెండు చిరుతలు కనిపించాయి.వాటి నుంచి తప్పించుకోవాలంటే తెగింపు ఇంకా ఆలోచన ఉండాలి. లేనట్లయితే సిబ్బంది పైకి దూకుతుంది.

అదే విధంగా చీకటీగల కోన వద్ద పొదల్లో చిరుత కనిపించింది. దానిని మనుషులు కనిపించకుండానే బెదిరించాలి. వెంట్రుక వాసిలో ప్రమాదం నుంచి బయట పడ్డారు. అలా చేసి అది వెళ్లిన తరువాత కూంబింగ్ చేపట్టారు. పది నెలల క్రితం సచ్చినోడి బండ వద్ద ఇదే టీం కు ఎలుగుబంట్లు ఎదురయ్యాయి. శ్రీవారిమెట్టు నుంచి 60 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకరమైన జంతువులు అనేకం ఉంటాయి. అర్ ఎస్ ఐ వాసు టీం కు కూడా ఎర్రగుట్ట అటవీ ప్రాంతంలో ఎలుగుబంట్లు ఎదురయ్యాయి. వీటికి కనిపించకుండా మరో మార్గం లో వెళ్లాల్సి వచ్చింది. ఇలా టాస్క్ ఫోర్స్ సిబ్బంది ప్రతి రోజు ఒక సాహసం చేయాల్సి ఉంటుంది. వీరి కోసం ఐజి శ్రీ కాంతారావు గారు అవసరమైన మెడిసిన్ లు సిద్దం చేసి ఉంటారు. పాము కాటు మందులను అందుబాటులో ఉంచుతారు. ఎటువంటి ప్రమాదం జరిగినా ఎదుర్కునేందుకు వీలుగా శిక్షణ తో పాటు మందులు ఫస్ట్ ఎయిడ్ కిట్లు సిద్దంగా ఉంచుతారు. దీంతో సిబ్బంది చురుకుగా ఉంటూ అడవులలో సాహసం గా కూంబింగ్ చేయగలుగు తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -