Tuesday, May 21, 2024
- Advertisement -

ఆలస్యంగా నడువనున్న రైళ్లు

- Advertisement -

జూన్ నెలలో రెండు రోజుల పాటు రైళ్లు ఆలస్యంగా నడుస్తాయి.  ఆ తేదిలు  జూన్ 7, జూన్ 14. ఇంతకీ ఎందుకనుకుంటున్నారా. ఏం లేదు… సికింద్రాబాద్ – డోన్ ల మధ్య సెక్షన్ లో రైల్వే శాఖ కొన్ని నిర్మాణ పనులు చేపడుతోంది. ఈ సందర్భంగా కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని రైల్వే శాఖ తెలిపింది. కాచిగుడా – గుంతకల్ పాసింజర్ రైలు ఉదయం 9 -40 కి బయలుదేరాలి. అయితే రెండు గంటలు ఆలస్యంగా 11 – 40 కి బయలుదేరుతుంది.

కర్నూలు – కాచిగూడా ప్యాసింజర్ రైలు కూడా ఉదయం 7 -05కి బదులుగా 9-35 గంటలకు బయలుదేరుతుంది. మహబూబ్ నగర్ – మిర్జాపల్లి ప్యాసింజర్ రైలు సాయంత్రం 4-10కి బయలుదేరాల్సి ఉంటే రాత్రి 8 గంటలకు బయలుదేరుతుందని రైల్వే శాఖ పేర్కొంది. వీటితో పాటు కాచిగుడా – మహబూబ్ నగర్ ప్యాసింజర్ రైలు మధ్యాహ్నం 1-10 గంటలకు బదులు సాయంత్రం 4 -40 గంటలకు కాచిగుడా నుంచి బయలుదేరుతుందని రైల్వే శాఖ తెలిపింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -