Monday, May 20, 2024
- Advertisement -

త్వ‌ర‌లోనే అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్‌కు క్లీన్ చిట్‌…?

- Advertisement -

జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో ఈడీకి దెబ్బ‌మీద దెబ్బ‌లు త‌గులుతున్నాయి. తాజాగా ఈడీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది.అరబిందో, హెటిరో , సాక్షి ఆస్తుల జప్తు కేసులో కూడా ఈడీ వైఖరిని ట్రిబ్యునల్ తూర్పార పట్టింది. అరబిందో, హెటిరోలు 21.5 కోట్ల బెనిఫిట్ కోసం 29కోట్లు లంచం ఇచ్చారని ఈడీ చెప్పడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కేసుని కొట్టివేస్తూ అక్రమంగా ఆస్తులు అటాచ్లు చేశారని ఈడీని ట్రిబ్యునల్ తీవ్రంగా తప్పుపట్టింది .మొత్తం మీద జగన్ అక్రమాస్తుల కేసులను విచారిస్తున్న ఈడికి ట్రైబ్యునల్ వరుసగా షాకుల మీద షాకులిస్తోంది.

మొద‌టినుంచి జ‌గ‌న్‌పై పెట్టిన కేసుల‌న్నీ అక్రమంగా పెట్టిన‌వే నిని జ‌గ‌న్ చెప్తున్నారు. జ‌గ‌న్ చెప్పిన‌వ‌న్నీ నిజం అవుతున్నాయి. జగన్, విజయసాయిరెడ్డి,మాధవ రామచంద్రన్, టిఆర్ కణ్ణన్, ఎకె దండమూడిలను మోసగించి సాక్షిలో పెట్టుబడులు పెట్టించారని ఈడీ చెప్పడంపై పిఎంఎల్ఎ ట్రిబ్యులన్ మండిప‌డింది. మోసపోతే వాళ్లెందుకు కేసు పెట్టలేదని సూటిగా ప్రశ్నించింది.

ప‌దిరోజులకింద‌ట‌నే సాక్షి చెందిన 34.5 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్ల జప్తు చట్ట విరుద్ధమని చీవాట్లు పెట్టి.. అటాచ్ మెంట్ ను కొట్టివేసింది. సాక్షిలో 60మంది ఇన్వెస్ట్ చేస్తే కొందిరి ఆస్తులే ఎందుకు జప్తు చేశారన్న ప్రశ్నకు ఈడీ వద్ద సమాధానమే లేదని ట్రిబ్యునల్ పేర్కొంది.

అయితే కేసు పూర్తయ్యే వరకు ఎఫ్ డీ లు ఇస్తామని.. భూములు తిరిగివ్వాలని అరిబందో, హెటిరోల ముందుకు రావడంతో.. ట్రిబ్యునల్ అంగీకరించింది. ఎఫ్ డీలు తీసుకొని వారి భూములు వాళ్లకు ఇచ్చేయాలని ఆదేశించింది. సాక్షి కార్యాలయాల అటాచ్ మెంట్ కేసుల్లోనూ జగన్ కు ఊరట. 9.50 కోట్ల విలువైన సాక్షి కార్యాలయాలు అటాచ్ మెంట్ ను ట్రిబ్యునల్ కొట్టివేసింది. ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే ఆక్ర‌మాస్తుల కేసుల‌నుంచి త్వ‌ర‌లోనే జ‌గ‌న్ క‌డిగిన ముత్యంలా బ‌య‌ట‌కు వ‌స్తార‌ని వైసీపీ నేత‌లు, అభిమానులు ధీమాతో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -