Monday, May 20, 2024
- Advertisement -

గ్రేటర్ ఎన్నిక – ఎవరి వ్యూహం వారిది

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక ఎత్తయితే రాష్ట్ర రాజధానిలో ప్రచారం చేయడం మరో ఎత్తుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. ఈ మధ్యనే వరంగల్‌ ఎన్నికల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటించిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఇక్కడ మాత్రం చివర్లో అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని పార్టీ అధినేతలు భావించడం ఎందుకోసమై ఉంటుందా అని అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇంతకు ముందు వరంగల్‌ ఎన్నికలలో చాలా ముందుగా ప్రకటించి వారి గెలుపుకు కావలసిన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కాని ఇక్కడ మాత్రం అలా కాకుండా విభిన్నంగా వెళుతోంది. ఈ విధంగా పార్టీ భావించడానికి తగిన కారణాలు లేకపోలేదనీ, ఎందుకంటే ఇక్కడ ఇంకా ఎవరైనా మంచి ప్రజలలో ప్రాచుర్యం ఉన్న తెదేపా, కాంగ్రెస్‌ నాయకుల్లో ఎవరినైనా తమ పార్టీలోకి ఆహ్వానించడానికే వేచి చూస్తున్నట్లు సమాచారం. ఆ పార్టీలనుంచి .. తెరాసలోకి వస్తాం అంటూ పెద్దనేతల్ని ఆశ్రయిస్తున్న వారు ఇంకా పెద్దసంఖ్యలో ఉన్నారు.

హైదరాబాద్‌ లాంటి మహానగరంలో గెలుపంటే కత్తిమీద సాములాంటిదే ననీ ఇంతకు ముందు చాలా పార్టీలకు తెలిసిన విషయమే, కాని కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితికి కూడా ఈ విషయం తెలుసు. అందుకే 2009లో మేయర్‌ ఎన్నికల్లో అసలు ఒక కార్యకర్తను కూడా తమ పార్టీ తరపున నిలబెట్టలేదు. కాని ఇప్పుడు అదే పార్టీ అధికారంలో కొనసాగుతున్న తరుణంలో తప్పకుండా ఇక్కడ నిలబడి తాము ఇక్కడ కూడా గెలువగలమనీ నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నటువంటి టీఆర్‌ఎస్‌ అసలు సిసలైన నాయకుల వేటలో ఉన్నదనీ, అందుకే ఇంకా తమ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడానికి ఆలస్యమవుతుందని చెప్పుతుందని అంటున్నారు.

నామినేషన్ల తేదీలు ఖరారు అయినప్పటికీ అభ్యర్థుల పేర్లు మాత్రం ఇప్పుడే ప్రకటించక పోవడం వెనుక బలమైన కారణాలే ఉంటాయని ఇతర పార్టీలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ కొన్ని పార్టీలకు భవిష్యత్‌ ఎలాగు ఉండదు కాబట్టి అటువంటి బలమైన నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తే కనీసం వారు అందులో కోల్పోయిన విలువను ఇక్కడ వారికి కల్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

అటువంటి నాయకులు ఎవరైనా సరే, వారిని తమ పార్టీ ఆహ్వానించడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయనే అందరూ అనుకుంటున్నారు. ఇటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న మరికొంత మంది నాయకులు కూడా అధికార పార్టీ ఆహ్వానానికి ఎదురుచూస్తున్నారని సమాచారం.

నిజానికి వరంగల్‌ ఎంపీ స్థానంతో పాటు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తమ పార్టీ అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం అనే వ్యూహాన్ని అనుసరించడం ద్వారా తెరాస ఒక భిన్నమైన వ్యూహంతో విజయాలను దక్కించుకుంది. కానీ అదే సూత్రం గ్రేటర్‌లో పారదని వారు గుర్తించారు. ఇక్కడ మాత్రం అన్ని పార్టీలూ అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత.. చివరలో తమ కేండిడేట్ల పేర్లు వెల్లడిస్తారని అంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -