Friday, May 17, 2024
- Advertisement -

ట్రంప్ కొత్త ఆర్డ‌ర్‌పై క‌సంత‌కం దేశీయ ఐటి సంస్థ‌ల‌పై పెనుభారం

- Advertisement -
trumps order on h 1b visas could impact tcs infosys other it firms

భార‌త ఐటీ కంపెనీల‌పై డొనాల్డ్ ట్రంప్ క‌త్తి వేలాడుతూనే ఉంది.     ట్రంప్ అనుకున్న‌ట్లుగానే ఐటీ సంస్థ‌ల‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇస్తున్నారు. అమెరికా ఉద్యోగాల‌ను విదేశీయులు కొల్ల‌గొడుతున్నార‌నీ మొద‌టినుంచి ట్రంప్ విరుచుకుప‌డుతూనే ఉన్న‌డాడు.దీనిలో భాగంగానే ట్రంప్ మ‌రో సంచ‌ల‌న‌మైన ఆర్డ‌ర్‌పై సంత‌కం చేశారు. ఈ సంత‌కందేశీయ ఐటీ సంస్థ‌ల‌కు ఉరితాడు మారింది. అమెరిక‌న్ల‌కే ఉద్యోగాలంటూ చెప్ప‌తున్న ట్రంప్ విదేశీయులు అమెరికాలో పని చేసేందుకు వీలుగా జారీ చేసే హెచ్‌1బీ వీసా నిబంధనల మార్పులకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ట్రంప్ సంతకం చేశారు.

ఉద్యోగాల్లో అమెరిక‌న్ల‌నే నియ‌మించుకోవాల‌న్న ట్రంప్ ఆదేశాలు  దీశీయ  ఐటీ సంస్థ‌ల‌కు పెనుభారంగా మార‌నున్నాయి. ముఖ్యంగా టీసీఎస్‌,ఇన్ఫోసిస్‌,కాగ్ని జెంట్ లాంటి ఇత‌ర ఐటీ సంస్థ పై తీవ్ర ప్ర‌భావం చూపించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయనీ విశ్లేష‌కులు చెబుతున్నారు. అమెరికాకు వెల్తున్న భార‌త ఐటీ నిపును కూడా ప్ర‌భావితం చేయ‌నుంది. అమెరికాలో ఐటీ సేవలందిస్తున్న ఈ సంస్థలకు చెందిన విదేశీ ఇంజనీర్లు  ప్రోగ్రామర్లు ప్రభావితం కానున్నారు. వీటిని ప్రత్యేక విధులకే మాత్రమే కేటాయిస్తారు. వీటిల్లో కూడా యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ నిబంధనల ప్రకారం ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉండాలి.

అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన 100 రోజుల్లోనే  అన్నీ ఉద్యోగాలు అమెరికా యువ‌కుల‌కే అన్న నినాదాన్ని తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేశారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీకి ఎన్ని అడ్డంకులు వ‌స్తున్నా అమ‌లు చేశారు. ఈ నిర్ణ‌యంతో ఫెడరల్‌ కాంట్రాక్ట్‌లు కూడా అమెరికా సంస్థలకే వ‌చ్చే అవ‌కాశం ఉంది.  ఇక హైర్ అమెరిక‌న్స్ నినాదానికే  ప్రాధాన్య‌త అని డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు లాట‌రీ విధానం ద్వారా హెచ్‌1 వీసా ఎంపిక వాధానం స‌రైన‌దికాద‌ని … ఆర్డ‌ర్‌పై సంత‌కం చేశారు. దీని వ‌ల్ల అమెరికాకు రాక‌పోక‌లు సాగించే వారిపై గ‌ట్టి నిఘాకూడా ఉండ‌నుంది.

అయితే ట్రంప్ అదేశాల‌కు అనుగునంగా ఐటీ కంపెనీలు సిద్ద‌మ‌వుతున్నాయి. దేశంలోని  అతిపెద్ద ఐటి సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ వీసా నియంత్రణ మార్పులను పరిశీలిస్తున్నామని ప్రకటించింది. అమెరికాలో  లోకల్‌ టాలెంట్‌  గుర్తించి శిక్షణ ఇప్పించే దిశగా  కృషి చేస్తున్నట్టు గతంలో చెప్పింది. అటు టీసీఎస్‌ కూడా దీనికనుగుణంగా చర్యలుచేపడతామని ప్రకటించింది.  యాక్సెంచర్‌, ఐబీఎం, గూగుల్‌ లాంటి ఇతర టెక్‌ సంస్థలు ఇప్పటికే అమెరిక్లను నియమించుకునే ప్రక్రియ మొదలు పెట్టాయి.   మరోవైపు ఈ సంవత్సరం హెచ్‌1బీ వీసాల దరఖాస్తుల సంఖ్య భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఇక నుంచి భార‌త ఐటీ నిపులు అమెరికా వెల్లాల‌న్న క‌ళ‌లు సాకారం కావాలంటే క‌ష్ట‌మే.

Related

  1. లోక‌ల్ … నాన్‌లోక‌ల్ కేటీఆర్ పంచ్ అదిరింది
  2. జగన్ కు ఎంత గొప్ప మనసు ఉందో ఇది చదివితే తెలుస్తుంది
  3. లోకేష్, జలీల్.. ఇద్దరూ ఇద్దరే..
  4. జగన్ కు ఎంత గొప్ప మనసు ఉందో ఇది చదివితే తెలుస్తుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -