ట్రంప్ దెబ్బకి కుప్పకూలిన సోషల్ మీడియా షేర్స్..!

- Advertisement -

అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత ఖాతాను నిషేధించడం వల్ల సోషల్​ మీడియా సంస్థల షేర్లు సోమవారం నష్టాలను చవిచూశాయి. ట్రంప్ ఖాతాను శాశ్వతంగా నిషేధించటం వల్ల ట్విట్టర్ షేర్లు 6.4 శాతం పడిపోయాయి. అటు ఫేస్​బుక్​ షేర్లు సైతం 4 శాతం తగ్గాయి. అమెరికా క్యాపిటల్​ భవనంపై దాడికి ట్రంప్​.. తన ట్వీట్ల ద్వారా మద్దతుదారులను రెచ్చగొట్టారన్న కారణంతో ఆయన వ్యక్తిగత ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా నిషేధించింది. ట్విట్టర్​ ఖాతాలో ఆయనకు 89 మిలియన్ల ఫాలోవర్స్​ ఉన్నారు. ఫేస్​బుక్​ ఈ నెల 20 వరకు ట్రంప్​ ఖాతాను స్తంభింపజేసింది.

అయితే ట్విట్టర్​ నిర్ణయానికి ట్రంప్​.. తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘త్వరలో మనం కొత్త ఫ్లాట్​ఫామ్​ను రూపొందిద్దామని’ అభిమానులను ఉద్దేశించి అన్నారు. ట్విట్టర్​, ఫేస్​బుక్​తో పాటు ఇతర సోషల్​ మీడియా సంస్థల షేర్లు సైతం తగ్గుముఖం పట్టాయి. యాపిల్, అమెజాన్​, ఆల్ఫాబెట్​ సంస్థల షేర్లు 2 శాతానికి పైగా తగ్గాయి. క్యాపిటల్​ ఘటనకు సంబంధం ఉందన్న ఆరోపణల మధ్య పార్లర్​ అనే యాప్​ను గూగుల్, యాపిల్​ స్టోర్​ నుంచి తొలగించాయి.

- Advertisement -

టీకా తీసుకుంటున్న సమయంలో ఒత్తిడికి గురైన జో బైడెన్‌..!

పండుగ నాడు శుభ వార్త.. భారత్ లో కొవిడ్ అంతం దిశగా..!

ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ‌కు మ‌రోసారి చుక్కెదురు!

త‌లైవా రావా ప్లీజ్‌.. నా నిర్ణ‌యం ఇదే!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...