Sunday, May 19, 2024
- Advertisement -

బాబుకు మొఖం చూపెట్టలేక!

- Advertisement -

కేంద్రంలో మంత్రి పదవులు అనుభవిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇద్దరూ.. ఇప్పుడు తలలు పట్టుకు కూర్చున్నారట. రాష్ట్రానికి అది తెస్తాం.. ఇది తెస్తాం అని ఇన్నాళ్లూ డబ్బా కొట్టి మరీ చెప్పుకొచ్చిన ఆ ఇద్దరూ.. చివరికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టాక.. సైలెంట్ అయిపోయారట.

ఎందుకయ్యా ఈ పరిస్థితి అంటే.. ఏం చేస్తాం అంతా మా ఖర్మ అన్న రేంజ్ లో.. బాధ పడిపోతున్నారట.

ఒక్క పోలవరం ప్రాజెక్టుకే కాదు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా నుంచి మొదలు పెట్టి.. చాలా విషయాల వరకూ ఈ సారి ఎంతో సాధిస్తామని.. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని.. ఆ ఇద్దరు మంత్రులు.. బడ్జెట్ కు ముందు బాబుకు భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ.. చివరికి ఏమైంది? దాదాపు 16 వేల కోట్ల రూపాయలు అవసరమైన పోలవరం ప్రాజెక్టుకు కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం కేటాయించింది. ప్రత్యేక హోదాపై మాట కూడా మాట్లాడకుండా బడ్జెట్ ప్రవేశపెట్టింది.

రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి సహాయం ప్రకటించకుండా నిరాశపరిచింది. ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు.. కేంద్ర మంత్రులు, ఆఖరికి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు కూడా నీటిమూటలే అని కేంద్రం తేల్చేసింది. ఈ విషయంపై.. పెద్దగా విమర్శలు రాకుండా ఇప్పటికే చంద్రబాబు అండ్ కో ప్రయత్నాలు మొదలు పెట్టినా.. లోలోపల మాత్రం ఇంకా ఆవేదనగానే ఉన్నారని తెలుస్తోంది. ఎంతో నమ్మకం పెట్టుకున్న కేంద్ర మంత్రులు కూడా.. ఏపీకి ఏమీ సాధించలేకపోవడం.. తనను తీవ్రంగా అవమానానికి గురి చేసిందని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది.

ఈ విషయం తెలుసుకున్న ఆ ఇద్దరు.. ప్రస్తుతానికి బాబుతో కాస్త దూరం మెయింటైన్ చేస్తున్నారట. చూడాలి.. అరుణ్ జైట్లీ బడ్జెట్.. ఆంధ్రా రాజకీయాల్లో ఇంకెన్ని మార్పులకు కారణమవుతుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -