Monday, May 20, 2024
- Advertisement -

2000 కి.మీ పాద‌యాత్ర‌ను పూర్తి చేసిన జ‌గ‌న్‌…

- Advertisement -

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటితో కృష్ణా జిల్లాను దాటి పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. కృష్ణా జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ప్రస్తుతం జగన్ పాదయాత్ర సాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించగానే జగన్ పాదయాత్ర రెండు వేల కిలోమీటర్ల దూరాన్ని కూడా పూర్తి చేసుకొంది.

కడప జిల్లా ఇడుపులపాయ నుంచి జగన్ పాదయాత్ర మొదలైన సంగతి తెలిసిందే. ఆపై కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా కృష్ణా జిల్లాలోకి వచ్చారాయన. ఇప్పుడు గోదావరి జిల్లాల్లోకి ప్ర‌వేశించారు.2000 కి.మీ పాద‌యాత్ర‌కు గుర్తుగా వెంట‌కాపురంలో నలభై అడుగుల ఎత్తున్న ఆ పైలాన్ ను జ‌గ‌న్ ఆవిష్క‌రించారు.

పాదయాత్ర సందర్భంగా ప్రజలతో మమేకం అవుతూ, వారికి రకరకాల హామీలను ఇస్తూ ముందుకు సాగుతున్నారు జగన్ మోహన్ రెడ్డి. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టబోయే నవరత్నాల కార్యక్రమం గురించి వివరిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తుతూ సాగుతున్నారు జగన్. పాదయాత్ర సందర్భంగా కోస్తాంధ్ర జిల్లాలో పలువురు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -