Sunday, May 19, 2024
- Advertisement -

ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌,ఛాన‌ల్ బండారం బ‌య‌ట పెట్టిన వైసీపీనేత భూమ‌న క‌రుణా క‌ర్‌రెడ్డి

- Advertisement -
YSRCP Expulsion ABN Andhra Jyothi paper and tv

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌ధాని మోదీతో భేటీ రాష్ట్ర‌వ్యాప్తంగా ఎంత ర‌చ్చ చేసిందో అంద‌రికి తెలిసిందే.అయితే ఇప్పుడు జ‌గ‌న్ మోదీకి ఇచ్చిన లేఖ‌ను ప్ర‌ధాని కార్యాల‌యంగాని…జ‌గ‌న్‌గాని మీడియాకు విడుద‌ల చేలేదు.

టీడీపీకి ఆస్థాన మీడియాల‌లో ఒక టైన ద‌మ్మున్న ఛాన‌ల్ జ‌గ‌న్ మోదీకి ఏడు పేజీల లేఖ ఇచ్చారంటూ కార్తా క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.దీనిపై వైసీపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.
వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని రాజకీయంగా అణగదొక్కేందుకు పచ్చ మీడియా దిగజారుడు రాజకీయాలు చేస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక పాత్రికేయ విలువలను పూర్తిగా వదిలేసిందని, పూర్తిగా దిగజారి లేనిది ఉన్నట్లుగా చూపించే ప్రయత్నం చేస్తోందన్నారు . ప్రధానమంత్రికి వైఎస్‌ జగన్‌ ఇచ్చిన వినతి పత్రంపై అసత్యాలు ప్రసారం చేస్తోందని, సిగ్గువిడిచి ఆంధ్రజ్యోతి అసహ్యంగా వార్త రాసిందని ఆయన మండిపడ్డారు.

{loadmodule mod_custom,Side Ad 1}

ఉమశంకర్‌ గౌడ్‌, గాంధీ అనే అధికారులు టీడీపీకి తొత్తులుగా మారారని వైఎస్‌ జగన్‌ ఫిబ్రవరి 17న ప్రధానికి లేఖ రాశారు. అయితే ఆ లేఖపై ఏప్రిల్‌ 13న కేంద్రం స్పందించి జవాబు ఇచ్చింది. ప్రధానికి జగన్‌ సమర్పించిన వినతిపత్రాన్ని అన్ని పత్రికలు ఇచ్చామని, అందులో అగ్రిగోల్డ్‌, ప్రత్యేక హోదా సహా అన్ని అంశాలను ప్రస్తావించార‌న్నారు. కానీ ఆంధ్రజ్యోతి విలువలకు తిలోదకాలు ఇచ్చి పిబ్రవరి 17న రాసిన లేఖను వైఎస్‌ జగన్‌ మే 10న ప్రధానికి ఇచ్చినట్లుగా చిత్రీకరించింది. నాటి లేఖను ఇప్పటి లేఖగా బురద జల్లుతోందది. ప్రజా సమస్యలపై వైఎస్‌ జగన్‌ …ప్రధానిని కలిస్తే దిగజారి అవాస్తవాలను ప్రచురించింద‌న్నారు.
ఒక పార్టీని, నాయకుడిని సర్వనాశనం చేయాలనే దుగ్ధతో ఆంధ్రజ్యోతి వ్యవహరిస్తోంది. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే శక్తిలేక ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు రాస్తోంది. టీడీపీ జెండాను ఆంధ్రజ్యోతి తన భుజాలపై మోస్తోంది. తప్పుడు వార్త రాసిన ఆంధ్రజ్యోతిపై ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తాం. లీగల్‌ నోటీసు ఇస్తాం. క్రిమినల్‌ డిఫమేషన్‌ (శిక్షార్హమైన పరువునష్టం) కేసు వేస్తామ‌న్నారు వైసీపీ నేత క‌రుణా క‌ర్‌రెడ్డి.

{loadmodule mod_custom,Side Ad 2}

ఆంధ్రజ్యోతి పత్రికతో పాటు, ఏబీఎన్‌ చానల్‌ను పత్రికలపై గ్రామస్థాయి నుంచి అన్ని స్థాయిల వరకూ మేం బహిష్కరిస్తున్నాం. మా పార్టీ కార్యాఆలయాలకు ఆ పత్రికా విలేకర్లు రావాల్సిన అవసరం లేదు.ఆ పత్రిక అంత సిగ్గుమాలిన పత్రిక ఈ ప్రపంచంలో మరొకటి లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -