Monday, May 20, 2024
- Advertisement -

బాబును క్రిమినల్ నెం.1 ఎందుకు అనకూడదు : జగన్

- Advertisement -

కాపు గర్జనలో ఆదివారం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో వైసీపీ హస్తం ఉందని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు..టిడిపి నేతలు పేర్కొనడంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల హామీలు అమలు నెరవేర్చకపోవడంపై బాబును క్రిమినల్ 1 అని ఎందుకు అనడకూడదని ప్రశ్నించారు.

ఒక ఘటనపై సీఎం బాబు ఇంత చీఫ్ గా మాట్లాడుతారని అనుకోలేదని, ఆంధ్ర చరిత్రలో జరగలేదేమో అని తెలిపారు. కాపులు సమన్వయం పాటించాలని, ఎక్కడా కూడా శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని సూచించారు.కాపులకు రిజర్వేషన్ విషయమై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ వేసి బీసీలకు నస్టం కలుగకుండా చూస్తామని, ఐదు సంవత్సరాల్లో ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ఎన్నికలకు ముందు టిడిపి మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగిందన్నారు.

22 నెలలు మాసాలైంది. ఎప్పుడు చేస్తారు ? ఎందుకు చేయడం లేదంటూ కాపు ఉద్యమం ప్రారంభమైందన్నారు. ఎన్నికల ముంబదుకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రతి కులం..మతంలో నిరుత్సాహం నెలకొందన్నారు. డ్వాక్రా సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామని..నిరుద్యోగ భృతి..ఇవన్నీ అమలు చేయకపోవడం వల్ల క్రిమినల్ నెంబర్ 1 అని ఎందుకు అనకూడదన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -