Monday, May 20, 2024
- Advertisement -

కేరళకు జ‌గ‌న్ కోటి విరాలం …అరబ్ బిజినెస్ టైకూన్ల భారీ విరాళాలు

- Advertisement -

వర్షాలు, వరదలతో కష్టాల్లో ఉన్న కేరళకు అండగా నిలుస్తోంది యావత్ భారతావని. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి మేమున్నామంటూ ఆపన్న హస్తం అందిస్తున్నారు ప్రజలు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అన్ని రంగాల ప్రముఖులు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.

తాజాగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తన చేయూతను అందించారు. పార్టీ తరపున కేరళకు రూ.కోటి సాయంగా ప్రకటించారు. ఈ విరాళాన్ని కేరళ సీఎం సహాయనిధినికి పంపించనున్నారు. వరదలు, వర్షాల నుంచి కేరళ త్వరగా కోలుకోవాలాని జగన్ ఆకాంక్షించారు.

జగన్ కేరళలో వర్షాలు, వరదలపై ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు రావడం బాధాకరమని.. ఈ కష్ట సమయంలో తన ప్రార్థనలు, ఆలోచనలు కేరళ ప్రజల వెంట ఉంటాయన్నారు. కేరళ ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు కేంద్రం సహకారం అందించాలని కూడా జగన్ కోరారు. ఇవాళ ఆయన తన సాయాన్ని ప్రకటించారు.

భారత సంతతి అరబ్ వ్యాపారులు దాదాపు రూ.13 కోట్ల మేర సహాయం ప్రకటించారు. దీంతో బాధితులను ఆదుకుంటామని, ఇందుకోసం పలు వ్యాపార సంస్థలు, ఇతర స్వచ్చంధ సంస్థలతో చెప్పిన యూఏఈ ప్రయత్నాలు ఫలించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని భారత సంతతి వ్యాపారాలు రూ.12.50 కోట్ల విరాళం ఇచ్చారు. కేరళకు చెందిన వ్యాపారవేత్త, లులు గ్రూప్ చైర్మన్,మ ేనేజింగ్ డైరెక్టర్ రూ.5 కోట్ల విరాళం ఇచ్చారు.

ఫాతిమా హెల్త్ కేర్ గ్రూప్ చైర్మన్ కేపీ హుస్సేన్ కూడా రూ.5 కోట్లు, యూఏఈ ఎక్స్‌చేంజ్, యునిమొని చైర్మన్, బిలియనీర్ బీఆర్ శెట్టి రూ.2 కోట్లు ఇచ్చారు. భారతీయ ఫిజీషియన్, దాత, అస్టర్ డీఎం హెల్త్ కేర్ వ్యవస్థాపక చైర్మన్ అఝద్ మూపెన్ రూ.50 లక్షలు ఇచ్చారు. ఖాతర్ చారిటీ రూ.34.89 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -