Sunday, May 19, 2024
- Advertisement -

మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ పార్టీ..!

- Advertisement -

పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక వైఖరినే ఎంచుకొంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా మోడీ ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న భూ సమీకరణ చట్ట సవరణల విషయంలో వైకాపా మోడీ వ్యతిరేక వైఖరిని అనుసరించనున్నట్టుగా ప్రకటించింది.

ఈ బిల్లు విషయంలో తాము మద్దతునిచ్చేది లేదని.. చర్చలోనూ.. ఓటింగ్ లోనూ వ్యతిరేక వైఖరే అని స్పష్టం చేసింది. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశాలో వైఎస్సార్ పార్లమెంటరీ పార్టీ ఈ విషయాన్ని ప్రకటించింది.

ఈ భూ సమీకరణ చట్టం వల్ల రైతులకు అన్యాయం జరుగుతుందని వైకాపా నేతలు అంటున్నారు. రైతులను దెబ్బతీసే ఈ ఏ చట్టానికీ తమ మద్దతు ఉండదని ఆ పార్టీ స్పష్టం చేసింది. భూ సమీకరణ చట్టంలోని సవరణల విషయంలో రైతుల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో అన్నా హజారేవంటి వాళ్లు కూడా మోడీ ప్రభుత్వంపై నిరసన తెలిపారు. ఈ బిల్లును అడ్డుకోవడానికి జాతీయ స్థాయి ఉద్యమానికే వారు సిద్ధం అయ్యారు.

ఇలాంటి నేపథ్యంలో వైకాపా కూడా ప్రభుత్వ వ్యతిరేకబాటనే పట్టింది. మరోవైపు భూ సమీకరణ చట్టంలోని సవరణలకు తెలుగుదేశం పార్టీ మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఈ బిల్లు విషయంలో తాము బీజేపీకి మిత్రపక్షంగానే వ్యవహరిస్తామని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. ఈ విధంగా రైతులకు సంబంధించిన బిల్లు విషయంలో ఒకటి కేంద్రానికి అనుకూలంగా మరోటి.. వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -