Friday, May 23, 2025
Home Blog Page 2435

అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసిన పవన్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను మర్యాదపూర్వకంగా కలిశానని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భేటీలో రెండు, మూడు అంశాలు చర్చకు వచ్చాయని పేర్కొన్నారు.

అమిత్ షాకు అభినందన సభ

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు నగరంలో అభినందన సభ జరుగనుంది. గురువారం సాయంత్రం సికింద్రాబాద్‌ లోని ఇంపీరియల్ గార్డెన్‌లో ఈ సభను నిర్వహించనున్నారు.

ఏపీ బడ్జెట్ రూ.1,11,824 కోట్లు

ఏపీ అసెంబ్లీ లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2013-14 బడ్జెట్ ను మొదటి సారిగా ప్రవేశ పెట్టారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మొత్తం బడ్జెట్ రూ.1,11,824 కోట్లతో ప్రవేశ పెడుతున్నామన్నారు.

అజెండా పూర్తి చేయలేకపోయాం : కోడెల

సభలో నిన్న, ఇవాళ అజెండా పూర్తి చేయలేకపోయామని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. సభలో అన్ని పక్షాలు సహకరిస్తే సభ సజావుగా నడపడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రతిపక్షం అంటే విమర్శలే కాదు, నిర్మాణాత్మక సూచనలు ఇవ్వవచ్చునన్నారు. ఈరోజు సభ వాయిదాపడిన తర్వాత సభ్యుల మధ్య అవాంఛనీయ ఘటన జరిగినట్టు తెలిసిందన్నారు. సభా మర్యాదలకు భంగం కలిగితే కఠిన చర్యలు తప్పవన్నారు. 

ఇక ఆన్ లైన్ లో ప్రత్యేక దర్శన టిక్కెట్లు

శ్రీవారి దర్శనానికి ఈనెల 27 నుండి ఆన్ లైన్ లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విక్రయించనుంది.

క్యాంపు ఆఫీసులో కేసీఆర్ కుటుంబ సర్వే

తెలంగాణ ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర సర్వేలో ముఖ్య మంత్రి కేసీఆర్ కుటుంబం కూడా పొల్గొంది. నేడు ఉదయం 11 గంటల సమయంలో క్యాంపు ఆఫీసులో అధికారులు కేసీఆర్ కుటుంబ వివరాలు సేకరించారు.  ఐటీ మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి, పిల్లలు ఈ సర్వేలో పాల్గొని వివరాలు అందించారు.

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిర్ణయం హర్షదాయకం

తనకు శాసనసభ్యునిగా అందే జీతం అంతా ప్రజాసంక్షేమానికే ఉపయోగిస్తానని, జీతం నుంచి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోనని  నెల్లూరు రూరల్‌ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి చెప్పారు.

తెరవెనుక ఎన్నోకష్టాలుంటాయి

ఇటీవల కాలంలో జనాలు ఎక్కువగా ముచ్చ టించుకున్న సినిమా 'హేట్‌స్టోరి 2. ముఖ్యం గా ఈ సినిమాలో కథానాయిక సుర్విన్‌చావ్లా  గురించి  చాలా  చెప్పుకున్నారు. అమ్మడికి సిగ్గు, బిడియం అంటేనే తెలియదు. గ్లామర్‌ ఒలకబోయడానికి బాగా తెగించింది.

పూలన్ దేవి హంతకుడికి జీవితఖైదు

పూలన్ దేవి హంతకుడు షేర్ సింగ్ రాణాకు ఢిల్లీ కోర్టు జీవితఖైదుతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించింది.

ఫ్యాషన్‌ ఐకాన్‌గా మారిన సోనమ్‌కపూర్‌

బాలీవుడ్‌ బ్యూటీక్వీన్‌ సోనమ్‌ కపూర్‌ దేశంలో ఫ్యాషన్‌ ఐకాన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. సినిమాల్లో ఫ్యాషనబుల్‌ డ్రెస్సుల్లో మెరుపులు మెరిపించే ఈ భామ ఫ్యాషన్‌ షోలలో కూడా షోస్టాపర్‌గా క్యాట్‌ వాక్‌చేస్తూ మైమరపిస్తోంది.

గోల్కొండ కోటలో పటిష్ఠ భద్రత

స్వాతంత్ర్య దిన వేడుకలకు గోల్కొండ కోటలో బందోబస్తు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం నాటి వేడుకలకు 5వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత కల్పించారు.

పేకాట క్లబ్ అనే మాట వినపడకూడదంటున్న కేసీఆర్

హైదరాబాద్లో పేకాట క్లబ్ అనే మాట వినపడకూడదని... అందుకు తగు విధంగా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు.

ఇష్టంలేకపోతే సినిమా చూడొద్దు!

అమీర్ ఖాన్ నటించిన వివాదస్పద 'పీకే' (ప్యార్కే) సినిమాపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ సినిమాలో అమీర్ ఖాన్ సగ్నత్వం ప్రదర్శించారని సినిమా నిర్మాతపై దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

‘హౌ ఓల్డ్ ఆర్ యూ’ జ్యోతిక

ప్రముఖ నటి జ్యోతిక తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారా అంటే అవుననే అంటున్నాయి తమిళ సినీ పరిశ్రమ వర్గాలు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'హౌ ఓల్డ్ ఆర్ యూ' చిత్రం తమిళంలో అదే పేరుతో రీమేక్ చేయనున్నారు. 'హౌ ఓల్డ్ ఆర్ యూ' చిత్ర నిర్మాణ హక్కులను జ్యోతిక భర్త, ప్రముఖ హీరో సూర్య సొంత నిర్మాణ సంస్థ  '2డీ ఎంటర్టైన్మెంట్' సొంతం చేసుకుంది.

నాగార్జునసాగర్ వద్ద రక్షణ శాఖ యూనిట్ ఏర్పాటు

నాగార్జునసాగర్‌లో రూ.1600 కోట్లతో డీఆర్డీఓ విభాగం ఏర్పాటు కానుంది. .ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ యూనిట్ కోసం వంద ఎకరాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

200 కిలోమీటర్లకు మెట్రోను విస్తరించాలి

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రోరైలు పరిధిని 200 కిలోమీటర్ల మేర విస్తరించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.