Tuesday, May 7, 2024
- Advertisement -

నాగార్జునసాగర్ వద్ద రక్షణ శాఖ యూనిట్ ఏర్పాటు

- Advertisement -

నాగార్జునసాగర్‌లో రూ.1600 కోట్లతో డీఆర్డీఓ విభాగం ఏర్పాటు కానుంది. .ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ యూనిట్ కోసం వంద ఎకరాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

దేశ రక్షణ అవసరాల కోసం నెలకొల్పబోయే యూనిట్‌కు నాగార్జునసాగర్‌ను ఎంపిక చేశారు.. భారతదేశంలో ఎక్కడా ఈ తరహా యూనిట్ లేదని సి.ఎమ్.కార్యాలయం తెలిపింది.ప్రపంచంలోనే ఐదు దేశాలలో మాత్రమే ఈ యూనిట్లు పనిచేస్తున్నాయని, అలాంటి యూనిట్ కు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకున్నుందుకు రక్షణ శాఖకు కృతజ్ఞతలు చెబుతున్నామని అన్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా,పరోక్షంగా వందలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి.పెద్ద ఎత్తున శాస్త్రజ్ఞల రాకపోకలు కూడా సాగుతుంటాయి. ముఖ్యమంత్రి కెసిఆర్,మంత్రి హరీష్ రావు తదితరులు సమావేశం అయి ఈ ప్రాజెక్టుకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి నిర్ణయం తీసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -