Wednesday, May 15, 2024
- Advertisement -

నేత‌లంద‌రి నోటా 110 నంబ‌రే.. ఎందుకంటే?

- Advertisement -

తెలంగాణ ఎన్నిక‌ల్లో చూశాం.. ఇప్పుడూ చూస్తున్నాం.. ఏంట‌నుకుంటున్నారా? స‌ర్వేలు. తమ తమ బలాబలాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవడానికి సర్వేలను చేయించుకొంటూ ఉన్నాయి. ఒకవైపు మీడియా సంస్థల సర్వేలు.. మరోవైపు పార్టీలు కూడా సొంతంగా సర్వేలు చేయించుకొంటూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓ పెద్ద చిక్కొచ్చి ప‌డింది. ఏంటంటే.. ఏపీలో రెండు ప్ర‌ధాన పార్టీలు చేయించుకున్న స‌ర్వేల్లో.. రెండింటికి ఒకే ర‌కంగా సీట్లు వ‌స్తాయ‌ని రిపోర్టు వ‌చ్చిందంట‌.

చంద్ర‌బాబు చేయించుకున్న స‌ర్వేలో.. జగన్ కోసం పీకే టీమ్ చేయించిన సర్వేలో .. 110 సీట్లు వ‌స్తాయ‌ని నివేదిక‌లు వ‌చ్చాయ‌ట‌. అయితే వాళ్లకు వాళ్లు వాళ్ల వాళ్లతో చేయించుకున్న సర్వేల్లో వచ్చిన ఈ ఫలితాలు ఎంత వరకూ నిజం అనేదే ప్రశ్నార్థకం. ఏ పార్టీ వాళ్లు సర్వే చేయించుకుంటే ఆ పార్టీకి అనుకూలంగానే రిపోర్ట్స్ వస్తాయ‌నేది సాధార‌ణం. మ‌రి వీటిని చూసి మురిసిపోతే దానంత బుద్ది త‌క్కువ ప‌ని ఇంకోటి ఉండ‌ద‌నేది వాస్త‌వం. పోలింగ్ రోజున ప్రజలు ఎటు మొగ్గుచూపుతారు అనేదాన్ని బట్టి పార్టీల భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంద‌నేది వాస్త‌వం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -