- Advertisement -

అవిగో ఎన్నికలు ఇవిగో తాయిలాలు

- Advertisement -

నిరుద్యోగ భృతి కింద ఏపీలోని ఒక్కో నిరుద్యోగికి నెలకు 1,000 రూపాయలు ఇస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ‘ముఖ్యమంత్రి-యువనేస్తం’ పేరుతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఆగస్టు నెలలోని మూడు లేదా నాలుగో వారం నుంచి ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. అర్హులైన నిరుద్యోగులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే నగదు జమ చేసేస్తామని ప్రకటించారు. అయితే నిరుద్యోగులు అంటే ఎవరు ? ఏ విద్యార్హత ఉండాలి ? ఎంత వయసు నుంచి ఎంత వయసు వరకూ ఉన్నవారు అర్హులు ? అనే ప్రశ్నలకూ మంత్రి ప్రస్తుతానికి ఓ స్పష్టత ఇచ్చేశారు. పోలటెక్నిక్,కానీ ఏదైనా డిగ్రీ కానీ పూర్తి చేసిన వాళ్లు నిరుద్యోగ భృతికి అర్హులని చెప్పారు. ఇక వయసు కూడా 22 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువతీ యువకులు ఈ పథకానికి అర్హులని, వారికే నిరుద్యోగ భృతి అందజేస్తామని మంత్రి చెప్పారు.

అయితే ప్రస్తుతం ఫించన్ లు ఇంటిలో ఒకరికే ఇస్తున్నాం. కానీ నిరుద్యోగ భృతి అలా ఉండదు. పైన చెప్పుకున్న అర్హతలు ఉంటే ఒక ఇంటిలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నా నిరుద్యోగ భృతి అందజేస్తామని, అది కూడా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే వేసేస్తాం అని తెలిపారు. యువతకు ఆన్‌లైన్‌పై పూర్తి అవగాహన ఉంటుంది కనక ఆన్ లైన్ ద్వారానే నమోదు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఆధార్‌ నంబర్ ను అనుసంధానం చేసి, పారదర్శకంగా ప్రకియను నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం నిర్వహించిన ప్రజా సాధికార సర్వే ప్రకారం ఏపీలో 12 లక్షల మంది నిరుద్యోగలు ఉన్నారని, డిగ్రీ, లేదా పాలటెక్నిక్ పూర్తి వారందరికీ నెలకు 1000 రూపాయల చొప్పున ఇవ్వాలంటే నెలకు 600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మంత్రి తెలిపారు. ఆ లెక్కన ఏడాదికి దాదాపు 8 వేల కోట్ల రూపాయలు ఖర్చు కానుందని అంచనా వేశారు. కానీ ఎన్నికల మ్యాని ఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేర్చేందుకే అంత ఖర్చుకు వెనకాడట్లేదని లోకేశ్ వివరించారు.

అంతవరకూ బాగానే ఉంది. ఏడాదికి 8 వేల కోట్ల రూపాయలతో నిరుద్యోగ భృతి ఇవ్వాలనుకోవడం మంచిదే. ఏ ఆధారం, సంపాదన లేని యువత తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఎంతోకొంత ఖర్చులు గట్టెక్కుతాయి. కానీ గత నాలుగేళ్లుగా ఈ నిరుద్యోగ భృతిని ఎందుకు టీడీపీ ఇవ్వలేకపోయింది ? అంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పుకొస్తున్నారు. మరి ఇప్పుడు లేవా ఆర్ధిక ఇబ్బందులు అంటే..ఎందుకు లేవు, ఉన్నాయి కానీ, అదే సమయంలో ఓ వైపు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కదా. ప్రతిపక్షం నిరుద్యోగ భృతిపై నిలదీస్తోంది కదా. అందుకే సడెన్ గా టీడీపీకి మ్యానిఫెస్టో, హామీలు గుర్తుకొచ్చాయి. వెంటనే లెక్కలు వేసి, వీలైనంత వరకూ నిరుద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు వయసు, చదువు, వగైరా షరతులు పెట్టి నిరుద్యోగ భృతి ప్రకటించారు.

అది కూడా ఎన్నికల హామీలో నెలకు 2 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పుడు 1000 రూపాయలకే పరిమితం చేశారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా, యథావిథగా వచ్చినా యువత చేజారిపోకుండా, టీడీపీకి దూరం కాకుండా ఈ గాలం వేశారు. అయితే నాడు 2000 ఇస్తామని నేడు 1000 రూపాయలే ఇస్తామంటున్నారు. అది కూడా 35 ఏళ్లు వయసు గరిష్ట పరిమితి పెట్టారు. ఈ నిబంధన మారిస్తే మరింత మందికి మేలు జరిగే అవకాశముంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకోవడానికి 38 ఏళ్ల వయసు వరకూ అర్హులే. ప్రత్యేకమైన రిజర్వేషన్లతో కలిపి 43 ఏళ్ల వరకూ కూడా కొన్ని ఉద్యోగాలకు అర్హులే. అలాంటప్పుడు చంద్రబాబు గారు ఇస్తున్న ఈ తాయిలం 35 ఏళ్ల వయసు వరకే కాకుండా 43 ఏళ్ల వయసు ఉన్నవారికీ ఇస్తే టీడీపీకే మరింత మేలు జరిగే అవకాశముంది. సో మరోసారి అర్హతలను పరిశీలిస్తారేమో…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -