Saturday, May 18, 2024
- Advertisement -

ఆయనకి భారత రత్న ఇవ్వాలి.. జగన్ డిమాండ్..!

- Advertisement -

భారతదేశం స్వాతంత్రం సాధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జాతీయ జెండా రూపకర్త అయిన తెలుగువాడు పింగళి వెంకయ్యకు భారత రత్న పురస్కారం ప్రకటించాలని ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు.

జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలని కోరారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​ను పురస్కరించుకుని పింగళికి భారత రత్న ప్రకటించటం సముచితమని ముఖ్యమంత్రి లేఖలో పేర్కోన్నారు. గాంధీయవాద ఆలోచనలతో స్వాతంత్రోద్యమంలో పాల్గొని తన జీవితం మొత్తాన్ని జాతి సేవకే అర్పించిన ఘన చరిత్ర పింగళి వెంకయ్యకు ఉందన్నారు. 1916లో వివిధ దేశాల జాతీయ పతాకాలను పరిశీలించి శాస్త్రీయ విధానంలో మన జెండాకు పింగళి రూపకల్పన చేశారని జగన్‌ తెలిపారు.

మచిలీపట్నానికి చెందిన పింగళి వెంకయ్య స్వాంతంత్య్ర సమరయోధుడుగా కీలకమైన పాత్ర పోషించారని… ఆయన అందించిన సేవలకు తగిన గుర్తింపు దక్కలేదని సీఎం పేర్కొన్నారు. అరుణాఆసఫ్ అలీ, భూపేంద్రకుమార్ హజారికా, నానాజీ దేశ్ ముఖ్ లాంటి ప్రముఖులకు మరణానంతరం భారతరత్న ప్రకటించినట్టు గుర్తు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటిపైనా మువ్వన్నెల జెండా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సీఎం వెల్లడించారు.

వోకల్​ ఫర్ లోకల్ పేరుతో మోదీ మళ్లీ మొదలు..!

పిల్లలు పుట్టకుండా సింహానికి ఆపరేషన్!

హైదరాబాద్ లో జలకన్య ఆకారంలో వింత శిశువు జననం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -