Thursday, May 16, 2024
- Advertisement -

అఖిల అహంకార‌మే ప‌త‌నానికి నాందా…?

- Advertisement -

క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో భూమా కుటుంబానికి ఓ ప్ర‌త్యేత ఉంది. అయితే భూమా నాగిరెడ్డి మ‌ర‌ణించిన త‌ర్వాత ప‌రిష్థితుల్లో పెను మార్పులు వ‌చ్చాయి. చివ‌రికి ఎందాకంటే రాజ‌కీయాల్లో భూమా వ‌ర్గం ఉనికే ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. అఖిల మ‌త్రిప‌ద‌వి చేప‌ట్టిన‌ప్ప‌టినుంచి సొంత పార్టీనేత‌లే మంత్రిని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.

జిల్లాలోని సీనియ‌ర్ నాకుల‌కు అఖిల మ‌ధ్య పొస‌గ‌డంలేద‌న్న‌ది తెలిసిందే. ఎవ‌రినీ లెక్క చేయ‌డంతో ఒక్కొక్క‌రుగా దూరం అవుతున్నారు సీనియ‌ర్ నాయ‌కులు. ఇక భూమాకు ప్రాణ‌స్నేహితుడైన ఏవీ సుబ్బారెడ్డి, అఖిల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గు మంటోంది. చివ‌రికి ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క వ‌ర్గంనుంచి నేనే పోటీ చేస్తాన‌ని మంత్రికి షాక్ ఇచ్చారు.

తాజాగా మంత్రి అఖిల‌కు మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. సొంతపార్టీ నేతలే మంత్రివర్గాన్ని పూర్తిగా బలహీన పరుస్తున్నారు. ఆళ్ళగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం మండలం పేరూరు గ్రామంలో గురువారం మంత్రికి గట్టి మద్దతుదారులైన పలువురు ఎంపిటిసిలు, ఓ జడ్పిటిసీతో పాటు 300 మంది కార్యకర్తలు ఏవి సుబ్బారెడ్డి వర్గంలోకి వెళ్ళిపోయారు.

ఇటు నియోజకవర్గంలోను అటు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర పార్టీలో కూడా దాదాపు ఒంటరైపోయారు. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో హటాత్ పరిణామాలతో మంత్రిలో టెన్షన్ మొదలైంది. అఖిల చేసుకున్న స్వ‌యం కృతాప‌రాధ‌మే అన్న‌ది తెలిసిందే.

నంద్యాల, ఆళ్ళగడ్డ నియోజకవర్గాల్లో బాగా పట్టున్న ఏవి సుబ్బారెడ్డితోపాటు మ‌రో సీనియ‌ర్ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డితో కూడా అఖిలకు ఏమాత్రం పొసగడంలేదు. ఏవి అయినా ఇరిగెల అయినా వచ్చే ఎన్నికల్లో మంత్రిని కాదని తమకే టిక్కెట్లు ఇవ్వాలంటూ చంద్రబాబునాయుడు వద్ద పట్టుపడుతున్నారు.

మంత్రివర్గంలో కానీ రాష్ట్రస్ధాయిలో కానీ సీనియర్లు కొందరు ఏవికి ఇరిగెలకు బాగా మద్దతిస్తున్నారు. అంటే అందరూ కలిసి అఖిలను దాదాపు దూరం పెట్టినట్లే అర్ధమవుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో దాంతో వచ్చే ఎన్నికల్లో అసలు అఖిలకు ఆళ్ళగడ్డలో పోటీ చేసేందుకు టిక్కెట్టు రాదేమో అన్న అనుమానాలు బాగా ప్రచారం జరుగుతోంది. టికెట్ రాకుంటే భ‌విష్య‌త్తు రాజ‌కీయాల్లో భూమా వ‌ర్గం క‌నుమ‌రుగు అవ‌డం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -