బిజేపి అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటన ఉద్రిక్తకరంగా మారింది. కోల్కతా నుంచి దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్ వైపు వెళ్తుండగా ఆయన వాహనశ్రేణిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది. మీడియాకు చెందిన వాహనాలూ దెబ్బతిన్నాయి. పోలీసులు దుండగులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
టీఎంసీ కార్యకర్తలే ఈ దాడి చేశారని బెంగాల్ బిజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలను తక్షణమే విరమించి, ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులకు మరోమారు విజ్ఞప్తి చేయనున్నారు. ఇదే అంశంపై మీడియా సమావేశం నిర్వహించనున్నారు.” అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.