Monday, May 6, 2024
- Advertisement -

జనసేనతో బీజేపీ కటీఫ్!

- Advertisement -

ఏపీ రాజకీయాలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి. టీడీపీతో జనసేన పొత్తు ఖరారు కాగా త్వరలోనే సీట్ల ఎంపిక ఓ కొలిక్కిరానుంది. ఇక ఈ కూటమిలో బీజేపీలో చేరడం ఖాయమని ప్రచారం జరిగింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టీడీపీతో పొత్తు కంటే ఒంటరిగా వెళ్లడమే మేలని భావిస్తున్న కమలనాథులు..అవసరమైతే పవన్‌తో కూడా తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధమయ్యారట. ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

నిన్నటి వరకు పవన్ మావాడేనని చెప్పుకొచ్చిన కమలనాథులు…ఇప్పుడు దత్తపుత్రుడేనని మాటమారుస్తున్నారట.దీనికి కారణం పవన్ ఒంటెద్దు పొకడేనని తెలుస్తోంది. చంద్రబాబుతో ములాఖత్ తర్వాత పార్టీ నేతల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోని పవన్ ఏకంగా పొత్తును ప్రకటించారు. తర్వాత తన తప్పు తెలుసుకుని జనసైనికులకు పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో వివరించే ప్రయత్నం చేశారు. అయితే జనసేన నేతలు సర్దుకుపోయినా బీజేపీ నేతలు మాత్రం పవన్‌పై గుర్రుగా ఉన్నారట.

ఎందుకంటే టీడీపీతో కలవడానికి బీజేపీ నేతలు మొదటి నుండి ఆసక్తి కనబర్చడం లేదు. ఇలాంటి సమయంలో పవన్‌…టీడీపీ గూటికి చేరడంతో ఈ విషయాన్ని బీజేపీ అధిష్టానం దృష్టికి సైతం తీసుకెళ్లారట ఏపీ బీజేపీ నేతలు. దీనిపై బీజేపీ అగ్రనాయకత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుండగా ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే జనసేనకు బీజేపీ దూరం కావడం ఖాయంగా కనిపిస్తోందని పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -