Monday, April 29, 2024
- Advertisement -

కన్ఫామ్..టీడీపీ – జనసేనతో బీజేపీ పొత్తు!

- Advertisement -

ఒకే ఒక్క భేటీతో టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ చేరిపోయిందా? టీడీపీతో బీజేపీని కలపాలన్న పవన్ పంతం నెరవేరిందా..? అసలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేష్‌ భేటీలో జరిగిందేంటీ? ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందే జనసేన – బీజేపీ ఒక్కటయ్యాయి. అయితే ఎక్కడాడ కలిసి ఆందోళన చేయకపోయినా మిత్రపక్షాంగానే ఉన్నాయి. ఇక చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీతో పొత్తును అనౌన్స్‌చేసిన పవన్‌…బీజేపీని దూరం పెట్టారు. ఓ సారి ఎన్డీయే నుండి బయటకు వచ్చానని మరోసారి ఎన్డీయేలోనే ఉన్నానని జనసేనాని చేసిన వ్యాఖ్యలు ఈ గ్యాప్‌ని మరింత పెంచాయి. దీంతో ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అన్న సందేహం కూడా వ్యక్తమైంది.

అయితే చంద్రబాబు రిమాండ్ తర్వాత బీజేపీ పెద్దలను కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు లోకేష్. కానీ అది సాధ్యపడలేదు. తాజాగా బుధవారం ఢిల్లీలో కేంద్ర హొంమంత్రిని కలిశారు లోకేష్. ఈ భేటీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి కూడా పాల్గొన్నారు. దీంతో ఒక్కసారిగా రాజకీయలు వేడెక్కాయి.

వీరి సమావేశాన్ని బట్టి చూస్తే టీడీపీ బీజేపీ మద్య సయోధ్య కుదిరిందని రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి పోటీచేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే నిజంగా పొత్తు కుదిరిందా లేదా చంద్రబాబు అంశం వరకే ఈ సమావేశం పరిమితమవుతుందా అన్నది తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా అమిత్ షాతో భేటీ తర్వాత బాబు విడుదలపై టీడీపీ శ్రేణులకు కాస్త ధైర్యం వచ్చినా ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్‌లోనే ఉన్నారు తెలుగు తమ్మళ్లు. మొత్తంగా ఒకే ఒక్క సమావేశం టీడీపీ -జనసేన బీజేపీ మధ్య మైత్రి బంధం కుదరిందనే టాక్ నడుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -