Wednesday, May 15, 2024
- Advertisement -

బాబు కాపు రిజ‌ర్వేష‌న్ స్కెచ్ అదిరిపోలా…

- Advertisement -

ఏపీలో కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై సీఎం చంద్ర‌బాబు నాయుడు హ‌టాత్తుగా సంచ‌ల‌న నిర్న‌యం తీసుకున్నారు. కాపుల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని కేబినేట్ నిర్న‌యం తీసుకుంది. అసెంబ్లీలో బిల్లును పాస్ చేయించి కేంద్రానికి పంపాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. ఇంత హ‌టాత్తుగా ఎందుకు నిర్న‌యం తీసుకున్నార‌నే ఆలోచ‌న‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌స్తుతం కులాల ఆధారంగానే రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయి. ఎన్నికల వేళ ఫలానా కులానికి రిజర్వేషన్లు కల్పిస్తామని రాజకీయ పార్టీలు చెప్పొచ్చు. మామూలుగా అయితే కులాల పేరుతో ఎన్నికల్లో ఓట్లు అడగకూడదని ఎన్నికల కమిషన్‌ చెబుతుంటుంది. ఎన్నికల కమిషన్‌కి రాజకీయ పార్టీలు విలువ ఇవ్వ‌డం ఎప్పుడో మ‌ర‌చిపోయాయి.

అస‌లు విష‌యానికి వ‌స్తే 2014 ఎన్నిక‌ల్లో చంద్రబాబు సర్కార్‌ కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వ‌చ్చారు. దాన్ని నిలబెట్టుకోవడానికి ఇదిగో.. ఇన్నాళ్ళు పట్టింది. మూడున్నరేళ్ళ తర్వాత, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడుతున్నారు. ఇంత‌లోనే రిజ‌ర్వేష‌న్లు వ‌స్తాయ‌ని అనుకుంటె పోర‌పాటు. అస‌లు క‌థ ముందుంది.

రిజ‌ర్వేష‌న్ల బంతిని కేంద్ర ప‌రిధిలోకి బాబు నెట్టేస్తున్నారు. ఆ తర్వాత డెసిషన్‌ కేంద్రానిదే. జస్ట్‌, చేతులు దులుపుకునే ఈ ప్రక్రియ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు మూడున్నరేళ్ళ సమయం తీసుకున్నారు. ఏడాదిలోనే కేంద్రం, చంద్రబాబు నిర్ణయానికి ఆమోదం తెలిపేయాల్సి వుంటుంది. చంద్రబాబు తీసుకున్న సమయంతో పోల్చితే, కేంద్రానికి మిగిలిన సమయం చాలా చాలా తక్కువే.

రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిలించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. సుప్రీంకోర్టు ఇటీవలే రిజర్వేషన్ల విషయమై సీరియస్‌ వ్యాఖ్యలు చేసింది. 50 శాతం రిజర్వేషన్లు దాటకూడదని హెచ్చరించింది. ఇంకోపక్క, బీసీ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీసీ సంఘాల నేత ఆర్‌.కృష్ణయ్య, కాపు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారు. మ‌రో వైపు పోల‌వ‌రం ఇష్యూను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు, 2019 ఎన్నిక‌ల్లో మ‌రో సారి అధికారం చేపట్టేందుకు బాబు హ్యూహంలా క‌నిపిస్తోంది.

కాపుల‌కు బీసీ రిజ‌ర్వేష‌న్లు అందాలంటె త‌తంగం చాలా ఉంది. . ఈ అంశం కోర్టుకు వెళితే వ్యవహారం మళ్ళీ బెడిసికొట్టేస్తుంది. వైఎస్‌ హయాంలో మైనార్టీ రిజర్వేషన్ల వ్యవహారం ఇలాగే అయ్యింది. చంద్రబాబు ‘కాపు స్కెచ్‌’ ఎక్కడిదాకా వెళుతుంది.? ‘కాపు కోటా’ అసలు అందుబాటులోకి వస్తుందా.? వచ్చాక న్యాయపరమైన చిక్కులుండవా.? బాబు చిత్త‌శుద్ధి ఏపాటిదో త్వ‌ర‌లో అర్థ‌మ‌వుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -