Thursday, May 30, 2024
- Advertisement -

బాబుతో నెల్లూరు నాయకుల భేటీలు….. నారాయణతో మునుగుతామని హెచ్చరికలు

- Advertisement -

ఇప్పటికే జిల్లాలో ఉన్న ప్రముఖ రాజకీయ కుటుంబాలన్నీ వైకాపాకు జై కొడుతున్నాయి. ఇక సోమిరెడ్డి-నారాయణల మధ్య అంతర్గత పోరు తారాస్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీసుకున్న ఒక నిర్ణయం నెల్లూరు జిల్లాలో టిడిపిని పూర్తిగా ముంచేసేలా కనిపిస్తోంది. నారాయణ కాలేజీల పుణ్యమాని మంత్రి నారాయణకు కోట్లాది రూపాయల డబ్బైతే వచ్చింది కానీ చెడ్డపేరు మాత్రం ఓ స్థాయిలో ఉంది. వరుసగా విద్యార్థుల మరణాలు, ఫీజుల పేరుతో తల్లితండ్రులను పీల్చిపిప్పిచేస్తున్న వైనాల గురించి ఓ స్థాయిలో సామాన్య జనం మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఆ స్థాయిలో చెడ్డపేరు తెచ్చుకున్న నారాయణ ప్రజల ఓట్లతో, మద్దతుతో సంబంధం లేకుండా డబ్బులతో కొనుగోలు చేసేవి అనే పేరున్న ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికలకు అయితే పార్టీకి ఎలాంటి సమస్యాలేదు.

కానీ ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికోబడాలి………ప్రజా మద్దతు పొందాలి అంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు టిడిపిలో ఈ విషయంపైనే చర్చలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లా ఎంపిని గెలిపించడం, నెల్లూరు టౌన్ నుంచి స్వయంగా ఎమ్మెల్యేగా గెలవడం, ఇతర ఎమ్మెల్యేలను గెలిపించడం అనే బాధ్యతలను నారాయణకు అప్పగించాడు చంద్రబాబు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు తెదేపా నెల్లూరు నాయకుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోంది. ఇప్పటికే మేకపాటి, ఆనం, నేదురుమల్లిలాంటి ప్రముఖ రాజకీయ కుటుంబాలు, వాళ్ళ మద్దతుదారులందరూ వైకాపాకు జై కొడుతున్నారు. నెల్లూరులో వైకాపా పూర్తిగా క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి. అలాంటి నేపథ్యంలో ప్రజలతో ఏ మాత్రం సత్సంబంధాలు లేని, క్షేత్ర స్థాయిలో ప్రజలచేత నాయకుడిగా గుర్తింపబడని నారాయణలాంటి నాయకుడి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్ళడమంటే పార్టీ విజయావకాశాలను పూర్తిగా మర్చిపోవడమే అని నెల్లూరు టిడిపి నాయకులు చంద్రబాబుకు ఫిర్యాదులు చేస్తున్నారు. పైగా విద్యాసంస్థల్లో ఫీజులు, విద్యార్థుల మరణం పుణ్యమా అని నారాయణకు ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేేకత ఉందని ………నారాయణ నేతృత్వంలో ఎన్నికలు ఎదుర్కోలేమని………అదే జరిగితే టిడిపి పూర్తిగా మునగడం ఖాయమని నెల్లూరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్, జగన్ అభిమానులతో పాటు, నేదురుమల్లి, మేకపాటి, ఆనం కుటుంబాల అభిమానులు, నేతలందరూ వైకాపా వైపు ఉన్న నేపథ్యంలో నారాయణలాంటి క్షేత్రస్థాయిలో ప్రజావ్యతిరేకత ఎదుర్కుంటున్న వ్యాపారస్థుడి నాయకత్వంలో ఎన్నికలు ఎదుర్కోవడం అంటే వైకాపా క్లీన్‌స్వీప్‌కి టిడిపి అవకాశం ఇచ్చినట్టేనన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -