Saturday, May 18, 2024
- Advertisement -

చంద్ర‌బాబు నుంచి అఖిల‌,ఏవీల‌కు పిలుపు..

- Advertisement -

కర్నూలు జిల్లా పార్టీ నేతల మధ్య కోల్డ్‌వార్‌ టీడీపీకి తలనొప్పిగా మారింది. సర్థుకుపోవాలని చెప్పినా నేతలు పంతాలకు పోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగ‌పూర్ వెల్లేముందు ఇద్ద‌రిని పిలిచి మాట్లాడినా వారిమ‌ధ్య విబేధాలు ఏ మాత్రం త‌గ్గ‌లేదు.

తాజాగా సుబ్బారెడ్డిపై రాళ్ల దాడి ఘ‌ట‌న జ‌ర‌గ‌డంపై అధినేత సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది . ఈ దాడి చేసింది మంత్రి అఖిలప్రియ అనుచరులే అంటూ ఆయన కేసు కూడా పెట్టారు. దీంతో 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా నేతలతో మాట్లాడి… ఈ ఘటనలపై ఆరా కూడా తీశారట. రేపు వచ్చి తనని కలవాలని మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిని చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రెండు రోజులగా ఉద్రిక్తత ఏర్పడింది. సుబ్బారెడ్డి సైకిల్ యాత్రపై… కొంతమంది యువకులు రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దాడి మంత్రి అఖిలప్రియ వర్గమే చేయించిందని సుబ్బారెడ్డి ఆరోపించారు. ఈ గొడవ మర్చిపోకముందే… ఇవాళ ఈ ఇద్దరు నేతలు పోటా-పోటీగా సైకిల్ యాత్రకు సిద్ధమయ్యారు. ఈ రెండు వర్గాలు ఎదురుపడితే గొడవలు జరిగే అవకాశం ఉండటంతో… ముందస్తు జాగ్రత్తగా భారీగా పోలీసుల్ని మోహరించారు. అంతకముందు రాళ్ల దాడికి నిరసనగా సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ బంద్‌కు పిలుపునివ్వగా… పోలీసులు అనుమతి నిరాకరించడంతో వెనక్కు తగ్గారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -