Thursday, March 28, 2024
- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ : పిల్లనిచ్చిన మామకే భరోసా ఇవ్వలేకపోయావ్‌..

- Advertisement -

ఎన్నిక‌ల ప్ర‌చారంలో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం, బాబుపై విమ‌ర్శ‌నాస్త్రాలు సందిస్తున్నారు. బాబు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతున్నారు. టీడీపీ ప్ర‌భుత్వం మాఫియాకు అడ్డాగా మారింద‌న్నారు. ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా అధికారిని జుట్టుపట్టుకుని లాక్కుని వెళ్తుంటే.. చంద్రబాబు భద్రత ఇచ్చింది ఆ మహిళా అధికారికా? ల‌ఏకా ఆయన ఎమ్మెల్యేకా? అని ప్ర‌శ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో కాల్‌మనీ ఆగడాలు పెరిగిపోతున్నాయి. జన్మభూమి కమిటీల దగ్గర ఆడపిల్లల డేటా ఉంది. హోదాను, కడప స్టీల్ ఫ్యాక్టరీని చంద్రబాబు తాకట్టు పెట్టారు. పొదుపు సంఘాల మహిళలకు రుణాలు మాఫీ చేయలేదంటూ జ‌గ‌న్ బ‌ద్వేల్ ఎన్నిక‌ల ప్రచారంలో ధ్వ‌జ మెత్తారు.

ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఎవరికీ భద్రత ఇచ్చాడు? రాష్ట్ర ప్రజలకా.. ఆయన కుమారుడు లోకేష్‌కా? ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. 108కి ఫోన్ కొడితే అంబులెన్స్ వస్తుందన్న నమ్మకం లేదు. చదువుల కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఉంది. జాబు కావాలంటే బాబు రావాలని ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో అన్ని వర్గాలను వంచించారు. ఇప్పుడు మళ్లీ మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ వస్తున్నారు. చంద్రబాబు పంచే డబ్బులతో మోసపోవద్ద‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. వైసీపీ అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని ప్ర‌జ‌ల‌కు భరోసా ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -