Sunday, May 5, 2024
- Advertisement -

కాంగ్రెస్‌తో పొత్తు ఖాయం….. జాతీయ మీడియాతో తేల్చేసిన బాబు

- Advertisement -

దటీజ్ చంద్రబాబు…….చంద్రబాబు వ్యూహాలు ఏంటో, తర్వాత అడుగులు ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే తెలుగు భజన మీడియాలో కాదు…….జాతీయ మీడియాలో చూడాలి. ఇప్పుడు కూడా జాతీయ మీడియాకు వరుసగా ఇంటర్యూలు ఇచ్చిన చంద్రబాబు అసలు విషయం తేల్చేశాడు. టిడిపి కనుక కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఉరేసుకుని చస్తా అని భారీ డైలాగ్ కొట్టిన టిడిపి సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని స్థాపించాడో ఇప్పుడు ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు రెడీ అయిపోయాడు.

జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు ఇచ్చిన సమాధానాల్లోనే ఆ విషయం సుస్పష్టంగా తెలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదిరాక, జాతీయ స్థాయిలో ప్రధాని పదవిపై ఆశతో, లోకేష్‌ని ముఖ్యమంత్రిని చేయాలన్న కోరికతో బిజెపికి చంద్రబాబు హ్యాండ్ ఇచ్చాడన్న విశ్లేషణలు ముందు నుంచీ ఉన్నాయి. చంద్రబాబు తాజా మాటలు ఆ కోణంలోనే ఉన్నాయి. బిజెపి, కాంగ్రెస్‌లు లేని జాతీయ కూటమి కేంద్రంలో అధికారంలోకి రావడం సాధ్యమా అంటే సాధ్యం కాదు అన్నాడు చంద్రబాబు.

బిజెపి కూటమితో మరోసారి కలిసే ప్రశ్నేలేదన్నాడు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సంకీర్ణంలో భాగస్వాములవుతారా అనే ప్రశ్నకు సమాధానం దాటవేశాడు. బిజెపితో కలవనన్న బాబు, కాంగ్రెస్‌తో కలిసే విషయం గురించి మాత్రం యస్ ఆర్ నో అని స్పష్టంగా చెప్పలేదు. అలాగే కాంగ్రస్, బిజెపియేతర కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పాడు. ఇప్పుడు బాబు చెప్పిన ఈ మాటలే 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి సాగబోతున్నాడన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు వైపు నుంచి అయితే ఆ విషయంలో పూర్తి స్పష్టత వచ్చింది. ఇక కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తేలేదు అన్న యనమల, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఉరేసుకుని చస్తాం అన్న సీనియర్ నేతలు, టిడిపి అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -