Tuesday, May 14, 2024
- Advertisement -

లగడపాటి సర్వేలో వైకాపా మెజారిటీ…… చంద్రబాబు షాకింగ్ స్పందన

- Advertisement -

వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు భారీగా ప్రజా స్పందన కనిపిస్తుండడం …..అధికారంలో లేకపోయినప్పటికీ వైఎస్సార్ పార్టీలో చేరుతున్న నాయకుల లిస్ట్ పెరుగుతూ ఉండడం…..మరీ ముఖ్యంగా టిడిపిలో ఉన్న సీనియర్ నాయకులే వాళ్ళ పుత్ర రత్నాలను వైకాపాలోకి పంపిస్తుండడం చంద్రబాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక ఇప్పుడు టిడిపి సానుభూతి పరుడు అయిన లగడపాటి రాజగోపాల్ సర్వేలో 2019లో వైకాపా ఘనవిజయం సాధించబోతోందన్న విషయం తెలియడం బాబును ఇంకా ఇబ్బందులకు గురిచేసేదే. ఆల్రెడీ జాతీయ మీడియా సర్వేల్లో టిడిపి-బిజెపి కలిసి పోటీ చేసినప్పటికీ 2019 ఎన్నికల్లో వైకాపాకే ఎక్కువ ఎంపి సీట్లు వస్తాయని తేలిపోయింది. దేశం మొత్తం మీద కూడా అత్యంత ఎక్కువ నమ్మకమైన సర్వే….తొంభై శాతం వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్న సీ ఓటర్ సర్వే కూడా జగన్‌ పార్టీదే గెలుపు అని విశ్లేషించడంతో టిడిపి శ్రేణులు దిగాలుపడుతున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో మామూలుగా అయితే చంద్రబాబు రెచ్చిపోయి మాట్లాడాలి. ప్రపంచానికే పాఠాలు చెప్పాను……. ఈ సర్వే చేస్తున్నవాళ్ళకు నా పాటి అనుభవం ఉందా అంటూ ఆవేశపడిపోవాలి. కానీ చంద్రబాుబ అండ్ బ్యాచ్ మాత్రం పూర్తిగా సైలెంట్ అయ్యారు. వైకాపా అధినేత జగన్ వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా చంద్రబాబుకు డైలాగులు లేకుండా పోయాయి. జగన్ ప్రజా సంకల్పయాత్ర గురించి విమర్శలు చేయడానికి కూడా టిడిపి నేతలకు, పచ్చ మీడియాకు ధైర్యం లేకుండా పోవడం టిడిపి స్థానిక నాయకులకు ఆశ్ఛర్యం కలిగిస్తోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా జగన్ ప్రజల మధ్యనే ఉంటూ ఉండడం…అనుక్షణం ప్రజల సమస్యలను వింటూ ఉండడం……అన్నింటికీ మించి చంద్రబాబు వైఫల్యాలను ప్రజలకు సమర్థవంతంగా వివరిస్తూ ఉండడంతో జగన్ పాదయాత్రపై ఏమని విమర్శలు చేయాలి అన్న విషయంలో టిడిపి బ్యాచ్‌కి సమాధానం దొరకడం లేదు. ఇక లగడపాటి సర్వేపై బాబు స్పందన ఏంటో తెలుసుకోవాలని జర్నలిస్టులు ప్రయత్నించినప్పుడు కూడా కనీసం స్పందన లేకుండా పోయింది. టిడిపి మంత్రులు, నేతలతో పాటు పచ్చ మీడియా కూడా ఈ లగడపాటి సర్వే గురించి అస్సలు ప్రజలకు తెలియకుండా ఉండడం కోసం పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంది. అయితే సోషల్ మీడియా పుణ్యమాని లగడపాటి సర్వే టాప్ రేంజ్‌లో ట్రెండ్ అవుతూ జనాలకు భారీగా రీచ్ అవుతూ ఉండడం గమనార్హం. జగన్‌కి సంబంధించిన మంచి విషయాలు, జగన్ గెలుపుకు సంబంధించిన విషయాలు వినిపిస్తేనే విమర్శలతో విరుచుకుపడియే బాబు అండ్ బ్యాచ్ ఇప్పుడు పూర్తిగా మౌనంలో ఉండిపోతూ ఉండడం మాత్రం టిడిపి శ్రేణులను, స్థానిక టిడిపి నాయకులను పూర్తిగా నిరాశలో ముంచేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -