Wednesday, May 15, 2024
- Advertisement -

అయిపోయింది….. అయిపోయాడు అన్న ఎల్లో ప్రచారం డిజాస్టర్

- Advertisement -

పనేం చెయ్యనవసరం లేదు….. ప్రచారం ఒక్కటి చాలు…. ప్రతిసారీ ప్రజలను మోసం చెయ్యొచ్చు అనే సిద్ధాంతాన్ని చంద్రబాబుకంటే ఎక్కువగా ప్రపంచంలో ఉన్న ఏ ఇతర నాయకుడు కూడా నమ్మడేమో. ఎందుకంటే బాబుకు ఆ ప్రచారమే భలేగా కలిసొచ్చింది మరి. అయితే ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివ్ అవ్వడంతో తన ప్రచార జిమ్మిక్కులు పూర్తిగా వర్కవుట్ కావడం లేదు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ కూడా తాను చేసిన అభివృద్ధిని చూపించి 2019 ఎన్నికల్లో ప్రజలను ఓట్లడుగుదాం….గెలుద్దాం అన్న ఆలోచన కంటే అసలు వైస్సార్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేద్దాం….జగన్‌ని రాజకీయాల్లోనే లేకుండా చేద్దాం అని కంకణం కట్టుకున్నాడు చంద్రబాబు. రాష్ట్రంలో జరిగిన ప్రతి తప్పునూ జగన్‌పైకే నెట్టాడు. చివరకు బాబు సొంత కేబినెట్‌లో ఉన్న మంత్రి కొడుకు ఒక మైనారిటీ స్కూల్ టీచర్‌ని వేధిస్తే దానికి కూడా కారణం వైఎస్ జగన్ అని ప్రచారం చేసే స్థాయికి వెళ్ళారు టిడిపి జనాలు. ఆ దుష్ప్రచారాన్ని జనాలు ఏ మేరకు నమ్మారు అనే విషయం పక్కన పెడితే బాబు అండ్ కో మాత్రం చాలా గట్టిగా నమ్మారు. జగన్ పని అయిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్వరలో మూతపడుతుంది అని సెటైర్స్ వేస్తూ సంకలు గుద్దుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదు అని ఎద్దేవా చేశారు.

మిగతా రాష్ట్రం అంతా ఎలా ఉన్నా చంద్రబాబు ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జగన్ ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న భారీ స్పందన చూశాక మాత్రం చంద్రబాబు గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. కడపలో, రాయలసీమలో జగన్‌కి అత్యంత ఎక్కువ ప్రజాదరణ దక్కినప్పటికీ టిడిపి జనాలు లైట్ తీసుకున్నారు. కులాభిమానం అని…ఇంకోటని కామెంట్స్ చేశారు. అయితే కృష్ణా జిల్లాలో జగన్‌కి వస్తున్న ప్రజాదరణ మాత్రం బాబు అండ్ బ్యాచ్ నాయకుల్లో కలవరం మొదలయ్యేలా చేసింది. నిన్న జరిగిన మీటింగ్‌లో కూడా చాలా సేపు జగన్ ప్రజా సంకల్పయాత్రకు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వస్తున్న ప్రజాదరణ గురించే చంద్రబాబు చర్చించారని తెలుస్తోంది. ఇక అతి త్వరలోనే జగన్ సంకల్పయాత్ర గోదావరి జిల్లాల్లో అడుగిడనుంది. అక్కడ కూడా ఇదే స్థాయి ప్రజా స్పందన కనిపిస్తే మాత్రం 2019 ఎన్నికల్లో నేనే గెలుస్తా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించడం చంద్రబాబుకి అసాధ్యం అవుతుందనడంలో సందేహం లేదు. రెండు గోదావరి జిల్లాల్లోనూ, విశాఖలోనూ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు గుంటూరు, కృష్ణా జిల్లాల స్థాయిలో ఆదరణ దక్కిందంటే మాత్రం ఆ తర్వాత చంద్రబాబుతో సహా టిడిపి నాయకులందరూ కూడా డిఫెన్స్‌లో పడిపోవడం ఖాయమని…..టిడిపి శ్రేణులు కూడా డీలా పడిపోతాయని బాబు భజన చేసే తోక పత్రిక మీడియా అధినేత కూడా టిడిపి నాయకులను హెచ్చరిస్తుండడం ఎల్లో బ్యాచ్ భయాలను చాటి చెప్తోంది.

ఏది ఏమైనా ప్రచార జిమ్మిక్కులతో అన్నీ సాధ్యమే అని నమ్మే బాబు నమ్మకంపై మాత్రం జగన్ భారీగానే దెబ్బకొట్టాడు. అయిపోయింది…… అయిపోయాడు అని బాబు అండ్ కో ఎంతగా దుష్ప్రచారం చేసినా…… ఎమ్మెల్యేలను, ఎంపిలను అనైతికంగా కోట్లాది రూపాయలతో కొనుగోలు చేసినా వెనకడుగు వేయని జగన్, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోని జగన్….. ఈ రోజు చంద్రబాబు సొంత అడ్డాలా భావించే గుంటూరు-కృష్ణా జిల్లాల్లోనే తనకు ప్రజా స్పందన ఏ స్థాయిలో ఉందో ఎల్లో బ్యాచ్‌కి స్పష్టంగా అర్థమయ్యేలా నిరూపించుకున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -