Wednesday, May 15, 2024
- Advertisement -

చిరు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్నారా….?

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి రాజ‌కీయాల‌ల్లో కొన‌సాగుతారా లేదా అనే ఊహాగానాలు రాష్ట్రంలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. టీడీపీ ,వైసీపీ లు త‌మ పార్టీలోకి రావాల‌ని ఇప్ప‌టికె చిరంజీవికి బంఫ‌ర్ అఫ‌ర్లు ఇచ్చారు. అయితే వైసీపీలోకి వెల్తార‌నె వార్త‌లు బ‌లంగా వినిపించాయి. కాని ఇప్పుడు తాజాగా చిరుగురించి మ‌రో ఆస‌క్తిక‌ర వార్త సంచ‌ల‌నంగా మారింది.

చిరంజీవి 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. అయితే ఆ సమయంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పిఆర్‌పిని కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి విలీనం చేశారు.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 2014 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో తీవ్ర ప్రభావాన్ని కాంగ్రెస్ పార్టీపై చూపింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు చిరంజీవి హజరుకావడం అంతంత మాత్రంగానే ఉంది. అయితే ఇటీవల 150 సినిమాలో నటించిన చిరంజీవి తిరిగి సినిమాలపై తనకు ఏమాత్రం ఆసక్తి తగ్గలేదని చెప్పకనే చెప్పారు.

చిరంజీవి రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సినిమాలకే పూర్తి సమయాన్ని చిరంజీవి కేటాయించే అవకాశం లేకపోలేదనే వార్తలు కూడ విన్పిస్తున్నాయి. 2018 మార్చి నాటికి చిరంజీవి రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారనే వార్త ఆస‌క్తిక‌రంగా మారింది.

ప్ర‌స్తుతం చిరంజీకి 151వ,సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. రాజకీయాలకు చిరంజీవి గుడ్‌బై చెబితే సినిమాల్లో ఇక బిజీ అయ్యే అవకాశం ఉందని ఆయన అభిమానులు చెబుతున్నారు. చూడాలి చిరంజీవి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -