Thursday, May 16, 2024
- Advertisement -

కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్‌రెడ్డి షెగ‌..

- Advertisement -

కాంగ్రెస్‌ పార్టీ అంటేనే ఓ స‌ముద్రం. పార్టీని నమ్ముకుని సుదీర్ఘ‌ కాలంగా రాజకీయాలు చేసి నిండా మునిగినవారు సైతం ఉన్నారు. పార్టీని నమ్ముకుని పని చేసినా సీటు వస్తుందన్న గ్యారెంటీ లేదు. మామూలు పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌లో పొజిషన్‌ ఇలా ఉంటే… ఇక ప్రస్తుతం తెలంగాణలో మహాకూటమితో క‌ల‌సి కాంగ్రెస్ వెల్తోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా త‌యార‌య్యింది.

కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్‌ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారి పరిస్థితే ఇలా ఉంటే ఇక నిన్నగాక మొన్న టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన రేవంత్‌ రెడ్డి వారికి సైతం అక్కడ చుక్కలు కనపడుతున్నాయి. రేవంత్‌ రెడ్డి పార్టీ మారేట‌ప్పుడు తనతో పాటు టీడీపీ నుంచి ఏకంగా ఓ టీమ్‌నే తీసుకు వెళ్లాడు.

రేవంత్‌ పార్టీ మారినప్పుడు ఆయన రాహుల్‌ గాంధీని మీట్‌ అయినప్పుడు రేవంత్‌ చెప్పిన వారికి ఏకంగా పది మంది వరకు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తామన్న హామీ వచ్చినట్టు వార్త‌లు షికార్లు చేశాయి. తీరా ఇప్పుడు చూస్తే అధిష్టానం రేవంత్‌కు షాక్ ఇచ్చింది. రేవంత్ కోరిన విధంగా టికెట్లు ఇవ్వ‌కుండా కాంగ్రెస్ మొండి చేయి చూప‌డంతో ఆయ‌న గుర్రుగా ఉన్నారు.

ఒకానొక దశలో తాను కూడ పోటీ నుండి తప్పుకొంటానని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తేల్చి చెప్పినట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడిందని సమాచారం. రెండు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

అవసరమైతే తాను కూడ కొడంగల్ నుండి పోటీ నుండి తప్పుకొంటానని ప్రకటించినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో రేవంత్ కొంత గట్టిగానే తన వాదనను విన్పించినట్టు సమాచారం. ఒకానొక దశలో రేవంత్ పార్టీ అధిష్టానంతో గొడవకు దిగినట్టు సమాచారం. రేవంత్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో ననే ఉత్కంఠ నెల‌కొంది.

పెండింగ్‌లో రేవంత్ రెడ్డి వర్గం సీట్లు ఇవే

సూర్యాపేట -పటేల్ రమేష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ – వేం నరేందర్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ – అరికెల నర్సా రెడ్డి, ఆర్మూర్ -రాజారామ్ యాదవ్, చెన్నూరు -బోడ జనార్దన్, దేవరకొండ -బిల్యా నాయక్, ఎల్లారెడ్డి -సుభాష్ రెడ్డి, ఇల్లందు – హరిప్రియ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -