Thursday, May 16, 2024
- Advertisement -

కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ కోవ‌ర్టులు..

- Advertisement -

తెలంగాణ ముందస్తు ఎన్నికలలో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి – మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాలలోను ఈ పరిస్థితి నెలకొంది. మహాకూటమి సీట్ల సర్దుబాటు పూర్తి అయిన తర్వాత ఒక్కొక్క అంశమే వెలుగులోకి వస్తోంది. కాంగ్రెస్ పార్టీలో 20 మంది కోవర్టులను అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశ పెట్టిందని టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం ఆరోపించారు.

అందుకే, 20 మంది డమ్మీలను కాంగ్రెస్‌ అభ్యర్థులుగా ప్రకటించిందని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలతో సమావేశమై.. ఎక్కడ డమ్మీ అభ్యర్థులను పెట్టాలో ఈ కోవర్టులు ఒప్పందం చేసుకున్నారని ఆయన మీడియాకు బుధవారం వెల్లడించారు. తమ వ్యాపార లావాదేవీల కోసం పార్టీ భవితవ్యాన్ని తాకట్టు పెట్టారని తీవ్ర విమర్శలు చేశారు.

ముందస్తు ఎన్నికలలో విజయమే లక్ష్యంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు మహాకూటమి కూడా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా తమ పార్టీలో కోవర్టులున్నారని ప్రకటించడం 20 మంది డమ్మీ అభ్యర్దులతో జాబితా ప్రకటించామని చెప్పడం కూడా ఈ వ్యూహంలో భాగమే అంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పనిచేసిన వారికి టికెట్లు రాకుండా.. ఈ కోవర్టులంతా కలిసి హైకమాండ్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌లో మాత్రం ఉద్యమ నాయకులకు టికెట్లు కేటాయించారని అన్నారు. టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్‌లో జరిగిన అవకతవకలను బయటపెడతాం’ అని ఆయన హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -