Friday, May 17, 2024
- Advertisement -

సీఎం ర‌మేష్‌పై ఐటీ దాడులు జ‌రిగితే…నిప్పు బాబుకు భ‌య‌మెందుకో…?

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఏపీలో ఐటీ దాడులను ముమ్మ‌రం చేసింది కేంద్రం.అధికార‌పార్టే టార్గెట్‌గా జ‌రుగుతున్న దాడుల‌తో బాబు అండ్ కో కు నిద్ర రావ‌డంలేదు. ఎప్పుడు ఎవ‌రి మీద ఐటీ అధికారులు దాడులు చేస్తారోన‌ని భ‌యం భ‌యంగా గ‌డుపుతున్నారు. ఒకొప్పుడు వైఎస్ జ‌గ‌న్ మీద ఐటీ దాడులు జ‌రిగిన‌పుడు పైశాచికానందం పొందిన టీడీపీ నాయ‌కుల‌కు ఇప్పుడు అవే ఐటీ దాడుల‌తో చుక్క‌లు క‌నిపిస్తున్నాయి.ప్ర‌తిప‌క్షాల మీద ఐటీ దాడులు జ‌రిగితే అవి స‌క్ర‌మం..అదే అధికార పార్టీల‌నేత‌ల‌పై దాడులు జరిగితే అవి అక్ర‌మ‌మ‌న్న‌ట్లు రీతిలో మాట్లాడుతున్నారు.

ఈ ఐటీ దాడుల‌ను చూస్తుంటే రాణా నటించిన లీడ‌ర్ సినిమా గుర్తుకొస్తుంది. ఆ సినిమా అస‌లైన నాయ‌కుల‌ను వ‌దిలి వారి బినామీల‌మీద ఐటీ దాడులు చేయించ‌డం చూశాం. చిన్న చేప‌ల‌ను లేకుండా చేస్తే పెద్ద చేప‌లు విల‌విలాడుతాయి. అదే సీన్ ఇప్పుడు ఏపీలో రిపీట్ అవుతోంది. పెద్ద త‌ల‌కాయ‌ల‌ను వ‌దిలి వారి బినామీల మీద ఐటీ దాడులు జ‌రుగుతున్నాయి.

సీఎం రమేష్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బాబు ఆర్థిక బ‌లం ఆయ‌నే అనేది అంద‌రికీ తెలిసిందే. పార్టీలోఅత్యంత కీలకమైన నాయకుడు. జనంలో అస్సలేమాత్రం పలుకుబడి లేని నాయకుడు సీఎం రమేష్‌. పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు కావడంతో, సీఎం రమేష్‌ చెప్పిందే వేదం.ముఖ్యమైన కాంట్రాక్టులు తొలుత సీఎం రమేష్‌ చేతుల్లోకి మాత్రమే వెళతాయి. ముఖ్యమైన.. అంటే, దానికి మళ్ళీ ఇంకో అర్థం వుంది. లాభసాటి కాంట్రాక్టులు అని దానికి అర్థం.

సీఎం రమేష్‌ తీరుపై, అప్పుడప్పుడూ టీడీపీలోనే నిరసన గళం వ్యక్తమవుతుంటుంది. ఆయన వేధింపులు తాళలేక, తెలుగు తమ్ముళ్ళు తమ అధినేత వద్ద పరిస్థితిని మొరపెట్టుకుంటుంటారు. కానీ, చంద్రబాబుకి సీఎం రమేష్‌ అంటే అపారమైన ప్రేమ. పార్టీ ఫిరాయింపులు.. జాతీయ స్థాయిలో వివిధ పార్టీలతో సంప్రదింపులు.. ఇలాంటి వ్యవహారాల్ని సీఎం రమేష్‌ చక్కబెడ్తుంటారు. అందుకే ర‌మేష్‌పై బాబుకు అంత ప్రేమ‌.

అందుకే ఇప్పుడు సీఎం ర‌మేష్ ఇల్లు, కార్యాల‌యాల‌పై ఐటీ దాడులు జ‌ర‌గుతుండ‌టంతో చిన‌బాబు, పెద బాబు విల‌విల్లాడిపోతున్నారు. ఎక్క‌డ త‌మ బ్ర‌తుకులు బ‌య‌ట ప‌డ‌తాయోన‌ని ప్ర‌తిప‌క్షాలు, కేంద్రం మీద చిందులు తొక్కుతున్నారు. సీఎం రమేష్ ను ఇంటిలో జరగడం హాట్ టాపిక్ అయ్యింది. చంద్రబాబునాయుడిని ఇబ్బంది పెట్టేందుకు.. ఇలా ఆయనకు సన్నిహితంగా ఉన్న వారిని టార్గెట్ చేశారని మండిపడుతున్నారు. ఎప్పుడూ నిప్పు అని చెప్పుకొనే బాబుకు వారిమీద ఐటీ దాడులు జరిగితే గింజుకుంటున్నారు. ఎందుకంటే వాల్లంద‌రూ చంద్ర‌బాబు బినామీల‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్మ‌మే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -