Saturday, April 27, 2024
- Advertisement -

చంద్రబాబు అనుమానం నిజం అవుతుందా..?

- Advertisement -

ఐటీ నోటీసులతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎన్నికల వేళ నోటీసులు రావడంతో చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నోటీసులు వచ్చిన దగ్గరి నుండి చంద్రబాబే టార్గెట్‌గా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఈడీ,సీబీఐతో విచారణ జరిపించాలని చంద్రబాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఐటీ నోటీసులకు తాను బయపడేది లేదని చంద్రబాబు బయటికి చెప్పినా అంతర్గతంగా పార్టీ ముఖ్యులతో తనను అరెస్ట్ చేస్తారేమోననే సందేహాన్ని వెలిబుచ్చారు బాబు.

ఇక తాజాగా ఇవాళ అనంతరం పురం జిల్లాలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ తనను రేపో, ఎల్లుండో అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. 45ఏళ్లు నిప్పులా బతికానని…ఏ తప్పూ చేయలేదు చెప్పుకొచ్చారు. ఇక ఇదే సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ టార్గెట్‌గా ఆయన ఓ సైకో అని తీవ్ర విమర్శలు చేశారు. తప్పులను ప్రశ్నిస్తే అక్రమకేసులు పెడుతున్నారని ఆరోపించారు.

ఇక ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. టీడీపీ శ్రేణులు సైతం బాబు మాటలు విని అవక్కైపోయారు. గతంలో ఎన్నోసార్లు చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కానీ వాటిని ఎదుర్కొన్నారు చంద్రబాబు. ఎప్పుడు ధైర్యాన్ని కొల్పోలేదు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బాబు అరెస్ట్ ఖాయమవుతుందా అని తెలుగు తమ్ముళ్లే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అలాగే పుంగళూరు, అంగళ్లు ఘటనల్లో చంద్రబాబుపై ఏ 1 గా కేసు నమోదైంది. ఈ కేసులో చంద్రబాబు ఎలాంటి ముందస్తు బెయిల్ తెచ్చుకోలేదు…ఇదే అంశంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది ప్రభుత్వం. సో ఓవైపు ఐటీ నోటీసులు మరోవైపు పుంగనూరు అల్లర్ల ఘటనలో చంద్రబాబు అరెస్ట్ ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే బాబు ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -