Tuesday, May 21, 2024
- Advertisement -

తొలి విడత అభ్య‌ర్తుల‌ జాబితాను ప్ర‌క‌టించ‌నున్న కేసీఆర్‌..?

- Advertisement -

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు కేసీఆర్ రెడీ అయ్యారు. అసెంబ్లీ ర‌ద్దుకు కూడా చ‌ర్య‌లు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. అభ్య‌ర్తుల ప్ర‌క‌ట‌న‌లో కూడా టీఆర్ఎస్ ముందుంది. ఇప్ప‌టికే ఇప్ప‌టికే జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సంజయ్ ను నిజామాబాద్ ఎంపీ కవిత ప్రకటించారు. కామారెడ్డి అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పేరును కేటీఆర్‌ మంగళవారం తెలంగాణభవన్‌లో ప్రకటించారు.

మ‌ద్యాహ్నంతెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నట్టు ప్రకటించారు.ఈ మేరకు అధికారికంగా సమాచారం వచ్చింది. ఈ మీడియా సమావేశంలోనే అభ్యర్థుల జాబితాను కూడ ప్రకటించే అవకాశం లేకపోలేదనే సమాచారం కూడ ఉంది.

మరో వైపు ఇవాళ సుమారు 50 మంది అభ్యర్థుల పేర్లను కూడ కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.లేదా తొలి విడత జాబితా పేరుతో కొందరు అభ్యర్ధుల పేర్లను కూడ ప్రకటించే అవకాశం ఉంది. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగే ‘ప్రజా ఆశీర్వాద’ సభలో టిఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటిస్తార‌ని మ‌రో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే మొద‌టి 15 మంది అభ్య‌ర్తుల జాబితాను విడుద‌ల చేస్తార‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.

హుజూరాబాద్ – ఈటెల రాజేందర్
బాన్సువాడ – పోచారం శ్రీనివాస్‌రెడ్డి లేదా ఆయ‌న కొడుకు
ఆదిలాబాద్ – జోగు రామన్న
ధర్మపురి – కొప్పుల ఈశ్వర్,
కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు
తాండూర్ – పి. మహేందర్‌రెడ్డి
వరంగల్ (వెన్ట్) – దాస్యం వినయ్ భాస్కర్
కరీంనగర్ – గంగుల కమలాకర్
కామారెడ్డి – గంప గోవర్ధన్
సిరిసిల్ల – కే.టీ.ఆర్
సికింద్రాబాద్ – టి. పద్మారావు
సూర్యాపేట – జగదీశ్వర్ రెడ్డి
మహబూబ్ నగర్ – వి. శ్రీనివాస్ గౌడ్
వనపర్తి – నిరంజన్ రెడ్డి
బాల్కొండ – వి. ప్రశాంత్ రెడ్డి
దేవరకద్ర – ఎ. వెంకటేశ్వరరెడ్డి
హుస్నాబాద్ – వి. సతీష్ కుమార్
గద్వాల – కృష్ణమోహన్ రెడ్డి
నకిరేకల్ – వేముల వీరేశం
మెదక్ – పద్మాదేవేందర్ రెడ్డి
వర్ధన్నపేట – ఆర్రూరి రమేశ్
నాగర్ కర్నూల్ – మర్రి జనార్ధన్ రెడ్డి
ఆర్మూర్ – ఏ. జీవన్ రెడ్డి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -