Sunday, May 19, 2024
- Advertisement -

ఢిల్లీ వెళ్లి సినిమా డైలాగులు హిందీలో చెప్పు

- Advertisement -

బలవంతపు భూ సేకరణకు జనసేన వ్యతిరేకం, ఎవరూ బలవంతంగా భూసేకరణ చేపట్టవద్దు, రైతుల జోలికి వస్తే జనసేన ముందుంటుంది. తుపాకులకు నేను ఎదురెళ్తా.. అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత రైతులతో చేసిన హడావుడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీకు నేనున్నాను. నన్ను అరెస్ట్ చేశాకే ఎవరైనా రైతుల జోలికి రావాలి. రైతులారా మీరు భయపడవద్దు. మీ వెనుక నేనున్నాను. అంటూ చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్ మూడేళ్లుగా ఏమైపోయారని రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు. లక్ష మంది పోలీసులు, వెయ్యి తుపాకులు ఎక్కుపెట్టినా వెనకడుగు వేయనంటూ చెప్పిన సినిమా డైలాగులు ఢిల్లీ వెళ్లి హిందీలో చెబితే బాగుంటుందని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 33వేల ఎకరాలు ప్రభుత్వం వివిధ రూపాల్లో రైతుల నుంచి తీసుకుంది. అందులో కొందరు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇంకొందరు నుంచి బలవంతంగా సేకరించారు. రేయింబవళ్లు పోలీసుల కాపలాపెట్టి, పంటను కాల్చేసి, రైతులను బెదిరించి, అక్రమ కేసులు బనాయించి, బినామీలతో రాజధాని ప్రాంతంలో భూములను కొనిపించి, బలవంతంగా ఇంకొందరి వద్ద నుంచి భూమిని సేకరించారు. రాజధాని ప్రాంతంలోని అందరూ స్వచ్ఛంధంగా ఇవ్వలేదు కానీ, చాలామంది బలవంతంగా కూడా ఇచ్చారు. అయితే ప్రాణాలైనా ఇస్తాం కానీ, భూముల్ని వదులుకోలేం. అని లబోదిబోమన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏమైపోయాడని రైతులు మండిపడుతున్నారు. ఇప్పుడు ఆయన పార్టీకి మైలేజ్ కోసమా..? ఇక్కడ సినిమా డైలాగులు చెబుతున్నాడని నిలదీస్తున్నారు. రాజకీయ లబ్ది కోసం రైతు సమస్యల పరిష్కారం పేరుతో డ్రామాలాడొద్దని హెచ్చరించారు.

ఓ వైపు గుజరాత్ లో అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం కోసం ధోలేరా నగరాన్ని 3లక్షల ఎకరాల్లో నిర్మిస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని పలువురు విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. చేగువేరా అభిమానిని అని చెప్పుకునే పవన్ కు ఏపీ రైతులు, వారి సమస్యలే కనిపిస్తున్నాయా ? గుజరాత్ రైతులు రైతులు కారా ? వారి భూములు భూములు కావా ? వారి సమస్యలు కనిపించడం లేదా ? అని నిలదీస్తున్నారు. నిజంగా ఏపీ రైతుల మీద, రాజధాని నిర్మాణం, ప్రత్యేకహోదా సాధన మీద పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి లేదని విమర్శిస్తున్నారు. అలా ఉంటే రెండుసార్లు మోడీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఎందుకు కనపడకుండా పారిపోయాడో చెప్పాలని నిలదీస్తున్నారు. దేశమంతా తిరిగి మద్దతు కూడగడతానని చెప్పి పారిపోయి, నేడు రైతులు, భూములు, తుపాకులు అంటూ సినిమా డైలాగులు చెప్పి తమను రెచ్చగొట్టి బలిపశువులను చేయవద్దని కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -