Wednesday, May 22, 2024
- Advertisement -

కేసీఆర్ ఫుల్ ఫోకస్ కోదండరామ్ పార్టీ పైనే

- Advertisement -

తెలంగాణ జన సమతి పేరుతో పురుడు పోసుకున్న పార్టీకి పురిటిలోనే చావుదెబ్బ కొట్టేసి సమాధి కట్టేయాలని టీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమతి పార్టీ దశాబ్దాల చరిత్ర కలిగి ఉన్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు వ్యతిరేకంగా ఏర్పాటైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అది పురుడుపోసుకుంది. కానీ తెలంగాణ విడిపోయాక చెప్పకోదగ్గ పార్టీలు ఏవీ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పుట్టుకురాలేదు. ఇటీవలే పురుడు పోసుకున్న కోదండరామ్ పార్టీ తెలంగాణ జన సమితి. ఆ పార్టీ ఏకైక లక్ష్యం కేసీఆర్ కుటుంబపాలనకు చరమగీతం పాడాలని చెబుతున్నారు. బంగారు తెలంగాణ పేరుతో దోచుకుంటున్నారని మండిపడుతున్నారు. ఉద్యమ సమయంలో తన లాంటివారినెందరినో వాడుకుని, తర్వాత పక్కన పెట్టేశారని, తెలంగాణ ద్రోహులకు ప్రభుత్వంలో స్థానం కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబ పాలన పోతేనే బంగారు తెలంగాణ సాధ్యమని కోదండరామ్ ఊరూవాడా ప్రచారం చేస్తున్నారు.

దీంతో కేసీఅర్ కోదండరామ్, ఆయన స్థాపించిన టీజేఎస్ పార్టీపైనే పూర్తి దృష్టి పెట్టారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. పూర్వపార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీకి వ్యతిరేకంగా ఏ తెలంగాణ నినాదంతో తమ టీఆర్ఎస్ పుట్టిందో అదే తెలంగాణ నినాదం, దోపీడి నినాదాలతో కోదండరామ్ పార్టీ ఎదిగిపోయే అవకాశాలనున్నాయని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ముందు ముందు జనాదరణ పొందితే టీఆర్ఎస్ స్థానంలో టీజేఎస్ మనుగడ సాగిస్తుందనే ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు కోదండరామ్ ఉద్యమకారుడేనన్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తే, ఆయన పార్టీని ఆదరిస్తే భవిష్యత్ లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కంటే తమకు బలమైన ప్రత్యర్ధిగా టీజేఎస్ అవతరించడం ఖాయమని తన అనుభవపూర్వకంగా కేసీఅర్ సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే కోదండరామ్ ప్రజల్లోకి వెళ్లకుండా, ఆయన పార్టీ మనుగడ సాగకుండా చేయాలని కేసీఅర్ వ్యూహం రచిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వ వ్యతిరేకతను పోగేస్తూ గతంలోనూ ఆయన చేపట్టిన స్ఫూర్తి యాత్ర, అమరవీరుల యాత్రలను ప్రభుత్వం అడ్డుకుంది. ఆంక్షలు విధించి అనుమతి నిరాకరించింది. ఆఖరికి కోదండరామ్ యాత్రల్లో ప్రధానంగా వినిపించిన ‘ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ… ఎవడేలుతున్నాడురో తెలంగాణ’ పాట మీద కూడా కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఎవడేలుతున్నాడు. ఎవడు తెచ్చాడో వాడే ఏలుతున్నాడు..అంటూ మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో కూడా మిగిలిన పార్టీ గెలుపోటముల కంటే టీజేఎస్ ఓటమిపైనే ఆయన ప్రధాన దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఒక్క సీటు కూడా గెలవకుండా టార్గెట్ పెట్టుకున్నారు. మరి కోదండరామ్ కేసీఆర్ వ్యూహల ముందు నిలబడతాడా ? ఆదిలోనే హంసపాదు అన్నట్టు చతికిల పడతాడా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -