Thursday, May 16, 2024
- Advertisement -

ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ ఆఫీస్ ఎన్టీఆర్ మ్యూజియంగా మారుతుంది….మంత్రి కేటీఆర్‌

- Advertisement -

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. మ‌హాకూట‌మిపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇటీవల సహచర మంత్రి హరీష్ రావు పైన కూటమి నేతలు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.

మహాకూటమి పుంజుకోవడం లేదని, వారు సీట్ల కోసం ఇంకా సిగపట్లు పడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తమ ప్రత్యర్థులు తేలకపోవడం వల్లే తమ పార్టీ అధ్యక్షులు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంకా ప్రచారం ప్రారంభించలేదని చెప్పారు. స‌రైన స‌మ‌యంలో కేసీఆర్ ప్ర‌చారాన్ని ప్రారంభిస్తాన‌న్నారు.

మ‌హాకూట‌మిలో టికెట్ల‌ను బాబే ఫైన‌ల్ చేస్తున్నార‌ని ఎద్దేవ చేశారు. సీట్ల కోసం మహాకూటమిలోని పార్టీలు కొట్లాడుకొంటున్నాయన్నారు.తెలంగాణలోని సెటిలర్సంతా టీఆర్ఎస్‌ వైపే ఉన్నారని కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణలో 100 సీట్లను తాము కైవసం చేసుకొంటామని కేటీఆర్ చెప్పారు.

కూటమి కలయిక ప్రజల్లో విశ్వాసం కల్పించలేకపోయిందని కేటీఆర్ తెలిపారు. కోదండరాం పోటీ చేసే కొన్ని స్థానాలకు ప్రత్యేకంగా మేనిఫెస్టో ఎందుకుని ప్రశ్నించారు. హరీశ్‌రావుపై ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలు దిక్కుమాలినవని కేటీఆర్ కొట్టిపారేశారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ దత్తపుత్రుడని ఆరోపించారు. తెలంగాణలో కులపిచ్చి లేదని… ఆ రాజకీయాలు ఇక్కడ చెల్లవని వ్యాఖ్యానించారు. ఎన్నికల తరువాత టీడీపీ ఆఫీస్, ఎన్టీఆర్ మ్యూజియంగా మారుతుందని అన్నారు.

మరో పది నుండి పదిహేను ఏళ్లు కేసీఆర్ సీఎంగా కొనసాగుతారని కేటీఆర్ ధీమాను వెలిబుచ్చారు.టీఆర్ఎస్‌లో 99 శాతం సంతృప్తి ఉందన్నారు.

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -