Monday, April 29, 2024
- Advertisement -

సీట్ల పంప‌కాల్లో కూట‌మికి సీపీఐ డెడ్ లైన్‌

- Advertisement -

తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీనీ మ‌ట్టి ప‌రిపించేందుకు కాంగ్రెస్ పార్టీ మ‌హాకూట‌మిని ఏర్పాటు చేసింది. ఈ కూట‌మిలో కోదండ‌రామ్ నేతృత్వంలోని టీజేఎస్‌, సీపీఐ, టీడీపీల‌తో క‌ల‌సి కూట‌మి ఏర్ప‌డింది. సీట్ల పంప‌కాల విష‌యంలో కూట‌మిలో విబేధాలు చెల‌రేగాయి. తాజాగా కూట‌మికి సీపీఐ షాకిచ్చింది.

కూట‌మిలో కాంగ్రెస్‌, టీడీపీ ల‌మ‌ధ్య‌ సీట్లు స‌ర్దుబాటు పూర్త‌యినా సీపీఐ, టీజేఎస్ పార్టీల‌కు విష‌యంలో సీట్లు స‌ర్దుబాటు కాలేదు. తాము పోటీ చేసే 9 అసెంబ్లీ స్థానాల వివరాలను సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు.

మా పార్టీకి ఉన్న బలం ఉన్న ఆధారంగా సీట్లను కోరుతున్నట్టు చెప్పారు. ఇవాళ్టికి కూడ మాకు కాంగ్రెస్ పార్టీ నుండి సానుకూలమైన సంకేతాలు రాలేదన్నారు. కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, సిద్దిపేట, బెల్లంపల్లి, ఆలేరు, మునుగోడు, మంచిర్యాల, దేవరకొండ, పినపాక స్థానాలు కోరినట్టు చెప్పారు. కాంగ్రెస్ స్పందించ‌కుంటే అభ్య‌ర్త‌ల పేర్ల‌ను కూడా ప్ర‌క‌టిస్తామ‌ని ఆల్టిమేట్టం జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ దిగి రాకపోతే మరో 20 స్థానాల్లో కూడ అభ్యర్థులను ప్రకటింస్తామ‌ని కూట‌మిలో బాంబు పేల్చారు చాడా వెంక‌ట్‌రెడ్డి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -