Thursday, May 16, 2024
- Advertisement -

కోట్ల చేరిక‌పై స్పందించిన ఫిరాయింపు ఎంపీ బుట్టారేణుక‌

- Advertisement -

టీడీపీలోకి కోట్ల రాక‌తో క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాలు మారుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో వైసీపీ అధిపత్యాన్ని తగ్గించేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. దానిలో భాగంగానే కోట్ల ఫ్యామిలీనీ పార్టీలో చేర్చుకొనేందుకు రంగం సిద్దం అయ్యింది. ఆయ‌న సైకిలెక్కుతే ఫిరాయింపు ఎంపీ బుట్ట‌రేణుక‌కు ఇబ్బందులు త‌ప్ప వ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా బుట్ట కోట్ల చేరిక‌పై స్పందించారు.

టీడీపీలోకి ఎవరొచ్చినా.. పార్టీ బలోపేతమవుతుందని, టికెట్ల విషయం అధిష్టానం చూసుకుంటుందని బుట్టా రేణుక అన్నారు. అందరికి న్యాయం చేసేలా చంద్రబాబు నిర్ణయం ఉంటుందన్నారు. జిల్లాలో పార్టీ గెలుపుకోసం అంద‌రం క‌ల‌సి క‌ట్టుగా ప‌నిచేస్తామ‌ని తెలిపారు.

2014 ఎన్నిక‌ల్లో వైసీపీ తుపుర‌న క‌ర్నూలు ఎంపీగా గెలిచిన బుట్టా రేణుక టీడీపీలోకి ఫిరాయించారు. రానున్న ఎన్నిక‌ల్లో బాబు అదే సీటును కేటాయిస్తార‌ని గంపెడు ఆశ‌లు పెట్టుకున్నారు. ప‌నిలో ప‌నిగా ఆమె విస్తృతంగా పర్యటిస్తోంది. అయితే అనూహ్యంగా కోట్ల చేరిక‌తో, కర్నూలు ఎంపీ సీటు ఆయనకే ఖరారు చేశారని ప్రచారం సాగుతోంది. అయితే బుట్టాకు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం లేదా ఎమ్మెల్సీ సీటు ఇస్తార‌నే ప్ర‌చారం టీడీపీలో వ‌ర్గాల్లో జ‌రుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -