Friday, April 26, 2024
- Advertisement -

ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదు ..!

- Advertisement -

ఆధార్ అనేది ఈ రోజుల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసిన ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు.. ప్రభుత్వ రంగాల్లోనైనా, ప్రభుత్వేతర రంగాల్లోనైనా దేనికైనా అప్లై చేసుకునేందుకు ఆధార్ తప్పనిసరి. ముఖ్యంగా బ్యాంకులలోనూ, రెవెన్యూ డిపార్ట్ మెంట్ లలోనూ, మీ సేవల లోనూ.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క డిపార్ట్ మెంట్ లో కూడా ఏదైనా పని చేయించుకునేందుకు ఆధార్ ఖచ్చితంగా ఉండాల్సిందే.

ఈ క్రమంలో ఆధార్ ను సామాన్యుడికి అవసరం అయ్యే ప్రతి దానికి అనగా బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ వంటి వాటికి అనుసంధానం చేయడం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరు వారికి ఉన్న ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నిటికి ఆధార్ ను అనుసంధానం చేస్తున్నారు. అయితే ఓటర్ కార్డు కు మాత్రం ఇంతవరకు ఆధార్ అనుసంధానం లేదు. గతంలో ఓటర్ కార్డుకు కూడా ఆధార్ అనుసంధానం తప్పనిసరి అనే వార్తలు వచ్చాయి..కానీ అప్పుడు ఎన్నికల సంఘం దానికి సంభంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

తాజాగా ఎన్నికల సంఘం ఆధార్ కార్డు- ఓటర్ కార్డు అనుసంధానంపై పలు కీలక విషయాలను వెల్లడించింది. ఆధార్-ఓటర్ కార్డు అనుసంధానం తప్పనిసరి కాదని ఈసీ అధికారులు స్పష్ఠం చేశారు. ఓటు వేయడానికి ఆధార్ అనుసందానానికి అసలు సంభందం లేదని తెలిపారు కానీ ఓటర్ కార్డు కు ఆధార్ అనుసంధానం చేసుకోవడం వల్ల బోగస్ ఓట్ల తొలగింపు సులభతరం అవుతుందని వెల్లడించారు. ఒకవేళ ఓటర్ కార్డ్ తో ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాలి అనుకునే వారు 6-బి ఫామ్ ద్వారా చేసుకోవచ్చని ఈసీ తెలిపింది.

ఇవి కూడా చదవండి

లర్ట్ : ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి ..!

సరిహద్దు రచ్చ.. సద్దుమనిగేనా ?

పతనమైన రూపాయి.. దేనికి సంకేతం !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -