Sunday, May 5, 2024
- Advertisement -

మోదీకి థ్యాంక్స్ చెబుతున్న లోకేష్‌..!

- Advertisement -

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వాగ్ధాటి, వాక్చ‌తుర‌త అంతా ఇంతా కాద‌ని మ‌న‌కు తెలిసిందే. త‌న నోటి నుంచి ఓ మాట వ‌స్తే అది మాములుగా రాదు. ఎంతో ఆలోచించి కానీ ఆయ‌న మాట్లాడ‌రని రాజ‌కీయ నేత‌లు అంటుంటారు. అలాంటి మోదీ నోట గుంటూరులో జ‌రిగిన స‌భ‌లో లోకేష్ నామ‌జపం వినిపించింది. కొన్ని సార్లు చంద్ర‌బాబును లోకేష్ తండ్రి అంటూ సంబోధించారు న‌రేంద్ర మోదీ. తండ్రి కొడుకుల ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను మోసం చేసిందన్నారు. ప్ర‌భుత్వాన్ని వాళ్లిద్ద‌రే న‌డిపిస్తార‌ని.. వారిద్ద‌రి కార‌ణంగా వ్య‌వ‌స్థ మొత్తం అవినీతిమ‌య‌మైంద‌న్నారు.

కానీ న‌రేంద్రమోదీ నారా లోకేష్‌కు అంత ప్రాధాన్యమివ్వ‌డ‌మేంట‌నేదే పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో ఇప్పుడు హాట్ టాపిక్. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ప్పు ముద్ర‌తో ఉన్న లోకేష్‌కు.. మోదీ దేశ వ్యాప్తంగా ఉచిత ప్ర‌చారం క‌ల్పించార‌ని అంటున్నారు నేత‌లు. లోకేష్‌ తెర వెనుక వ్య‌వ‌హ‌రాలు ఎలా నెర‌పుతారో తెలియ‌దు కానీ.. మైక్ ముందుకు వ‌స్తే మాత్రం తెలిపోతారు. మొద‌టితో పొలిస్తే ఇప్పుడు చాలా బెట‌ర్ అనుకోండి.

టీడీపీలో చంద్ర‌బాబు త‌ర్వాత ఎవ‌రంటే లోకేష్ పేరే చెబుతారు. ఇప్ప‌టికే బాల‌కృష్ణ కుటుంబాన్ని త‌న చెప్పుచెత్తులో పెట్టుకున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను మెల్లిగా సైడ్ చేశారు. లోకేష్‌ను ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో దింపి ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేకే పరోక్షంగా శాస‌న‌స‌భ‌కు పంపారు.

మోదీ ఈ వార‌స‌త్వ రాజ‌కీయాల‌ను హైలెట్ చేయాల‌నుకున్నారా? మోదీ అంత‌కు ముందు ఎన్టీఆర్ వెన్నుపోటు అంశాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి హైజాక్ చేసుకున్న పార్టీ ఇప్పుడు త‌న కొడుకుకు అప్ప‌గించ‌బోతున్నాడంటూ ప‌రోక్షంగా ఎవ‌రికైనా సందేశం ఇస్తున్నారా? మోదీ ఉద్దేశ‌మేదైనా లోకేష్‌కు మోదీ చేసిన ఫ్రీ ప‌బ్లిసిటీకి మాత్రం లోకేష్ మ‌న‌సులో కృత‌జ్ఞ‌తలు చెప్పుకునే ఉంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -