Friday, May 17, 2024
- Advertisement -

పటమటలంకలో ఓటు హక్కు వినయోగించుకున్న పవన్ కళ్యాన్!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం  2,214 డివిజన్, వార్డు స్థానాల్లో 580 ఏకగ్రీవం కాగా మిగతా వాటికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు.  ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. బరిలో 7,549 మంది అభ్యర్థులు ఉండగా, 77,73,231 మంది తమ ఓటు హక్కును వినియోగించుకో నున్నారు. మీడియాను 200 మీటర్ల దూరంలోనే పోలీసులు నిలిపివేస్తున్నారు.

పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను కూడా అధికారులు అనుమతించడం లేదు. దీంతో ఓటర్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటమటలంక జిల్లా పరిషత్‌ గర్ల్స్‌ హైస్కూల్‌లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌  తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పవన్ తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, పవన్‌ కళ్యాణ్‌ రాక సందర్భంగా గర్ల్స్‌ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఎన్నికల స్టంట్.. టీ కాచి సర్వీస్ చేసిన మమతా బెనర్జీ!

కృష్ణ జింక మాంసం కావాలా.. వీళ్ళు ఇస్తారు..?

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -