Monday, May 13, 2024
- Advertisement -

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం..!

- Advertisement -

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. ఉదయం 6 గంటలకే పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ఎన్నికల సిబ్బంది ముందుగా మాక్‌ పోలింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 78,71 272 మంది ఓటర్లు తమ ఓటు వేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 12 కార్పొరేషన్లలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి.

కాగా, 75 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ అవగా చిత్తూరు జిల్లా పుంగనూరు, కడప జిల్లా పులివెందుల, గుంటూరు జిల్లా మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 డివిజన్లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మొత్తం 7 వేల 552 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

ఈసారి అన్ని పార్టీల ప్రముఖులు తమ అభ్యర్థుల విజయావకాశాలు మెరుగుపర్చేందుకు అన్ని చోట్లా ప్రచార సభలు నిర్వహించారు. రాష్ట్రంలో చాలా వరకు ఓటర్ల స్లిప్పుల పంపిణీ కూడా పూర్తైంది. చివరి నిమిషం వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు సాగించారు.

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో హృతిక్ రోష‌న్ ఫైట్ !

ఆగిపోయిన ‘ఆచార్య’ షూటింగ్.. కారణం అదేనా?

దేత్తడి హారికకు టూరిజం డిపార్ట్‌మెంట్ దిమ్మతిరిగే షాక్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -