Thursday, May 16, 2024
- Advertisement -

ఇప్పుడంటే అడ్డుగా అభిమానులున్నా.. రేప‌టి సంగ‌తేంటి

- Advertisement -

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినీ జీవిత ప్ర‌యాణంలో ఊహంచిని విధంగా అగ్ర‌స్థానానికి చేరుకున్నాడు. ద‌క్షిణ భార‌త‌దేశంలోనే మ‌రే న‌టుడికీ లేనంత స్థాయిలో అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ప‌వ‌న్‌ను ఎవ‌రైనా ఏమ‌న్నా అంటే.. ఆయ‌న స్పందించాల్సిన ప‌నిలేదు. ఆయ‌న అశేష అభిమాన సైన్య‌మే అవ‌త‌లి వారిపై దాడిచేసి.. వారిని రోడ్డు కీడుస్తుంటారు. సినిమాల్లో ఉన్నంత వ‌రకూ ఇది బాగానే చెల్లిపోయింది. కానీ.. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినీ జీవితాన్ని వ‌దిలి ప్ర‌జా జీవితంలోనికి అడుగు పెట్టారు. ఆయ‌న రాక‌ను అభిమానులు సైతం స్వాగ‌తించారు. ప‌వ‌న్ ఎక్క‌డికి వెళ్లినా అభిమానులు పెద్దఎత్తున చేరుకుని.. సీఎం.. సీఎం అంటూ వారి మ‌న‌సులో కోరుకుంటున్న విష‌యాన్ని బ‌లంగా బ‌య‌ట‌కు వినిపిస్తున్నారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. ఇక‌ముందు రాజ‌కీయ స‌మ‌రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఇబ్బంది పెట్టేందుకు ఎదుటి పార్టీలు డోస్ పెంచ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. తాజాగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వ్యాఖ్య‌లే దీనికి నిద‌ర్శ‌నం.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌క్తిగ‌త జీవితం స‌రిగా లేద‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఇప్ప‌టికి మూడు పెళ్లిల్లు చేసుకుని.. న‌లుగురు పిల్ల‌ల‌కు తండ్ర‌య్యాడు. ఇదే ఇప్పుడు ప‌వ‌న్ పాలిట శాపంగా మార‌బోతోంద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. ప్ర‌జాజీవితంలోనికి వ‌చ్చే వారికి ఎలాంటి మ‌చ్చ ఉన్నా.. దానినే ఎదుటి పార్టీలు టార్గెట్ చేస్తుంటాయి. ప‌వన్ క‌ళ్యాణ్ కూడా ఈ విష‌యంలో అతీతుడేం కాదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడిని టార్గెట్ చేసేందుకు అత‌ని కుమారుడు లోకేష్‌పై ప‌వ‌న్ గ‌త కొంత‌కాలంగా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎవ‌రో చెప్పారు.. ఎవ‌రో అన్నారంటూ.. లోకేష్‌ను అత్యంత అవినీతి ప‌రుడంటూ ప‌వ‌న్ వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శిస్తున్నారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని కూడా.. ఆయ‌న ద‌గ్గ‌ర చాలా డ‌బ్బుంది, ఆయ‌న అవినీతికి మ‌హారాజ‌న్న‌ట్టుగా ప‌వ‌న్ చాలా సంద‌ర్భాల‌లో విమ‌ర్శించారు. అయితే.. ఇన్నాళ్లూ ప‌వ‌న్‌ను తెలుగుదేశం, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు పెద్ద‌గా విమ‌ర్శించ‌లేదు. ఎన్నిక‌ల్లో భాగంగా పొత్తులు.. లెక్క‌లు మారే అవ‌కాశం ఉంటుందేమోన‌నే ఆలోచ‌న‌తోనే ప‌వ‌న్ విష‌యంలో సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నారు. తాజాగా.. జ‌గ‌న్ త‌న మ‌న‌సులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ఏమ‌నుకుంటున్నార‌నేది కుండ బ‌ద్ద‌లుగొట్టేసిన‌ట్టు బ‌య‌ట‌పెట్టారు. అస‌లు అత‌ను రాజ‌కీయాల‌కే ప‌నికిరాడనే అర్థ‌మొచ్చేలా ఉతికి ఆరేశాడు. ఈ స్థాయిలో ప‌వ‌న్‌ను ఇప్ప‌టివ‌ర‌కూ విమ‌ర్శించిన వాళ్లు లేరు.

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ.. రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారిపోతూ ఉంటాయి. మిత్రులెవ‌రో.. శ‌త్రువెవ‌రో ఓ అవ‌గాహ‌న వ‌చ్చేస్తుంటుంది. అధికార పీఠంపై పాగా వేసేందుకు..ఎవ‌రిని ఎవ‌రూ లెక్క‌చేయ‌రు. ఎంత‌గా ఎదుటి వాడిని చిత్తు చేయ‌గ‌లిగితే.. అంత గొప్ప‌గా ఫీల‌య్యే ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ ప్ర‌స్తుతం న‌డుస్తోంది. ఇవ‌న్నీ చూస్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వ్య‌క్తిగ‌తంగా ఉన్న అతిపెద్ద లోపం.. త‌న వైవాహిక జీవిత‌మే. దానిని ల‌క్ష్యంగా చేసుకుని అత‌నిని ఇబ్బంది పెట్టేందుకు ప్ర‌తిప‌క్షాలు ఏమాత్రం వెనుకాడ‌వు. దీనికితోడు ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టింది. ఇది కూడా ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు ఆయుధంగానే మార‌బోతోంది. ప‌వ‌న్ త‌న‌తో క‌లిసి ఉంటూనే.. వేరే యువ‌తితో సంబంధం పెట్టుకుని ఓ బిడ్డ‌కు సైతం తండ్ర‌య్యాడంటూ.. రేణూ దేశాయ్‌.. కొంచెం ప‌రుష ప‌ద‌జాలంతో అన్నాలెజ్నోవాతో ప‌వ‌న్ బంధం గురించి బ‌య‌ట‌పెట్టింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు ప‌దేప‌దే త‌న వ్య‌క్తిగ‌త జీవితాన్ని ల‌క్ష్యంగా చేసుకుని బాధ‌పెడుతుండ‌డంతో.. వారికి బుద్ధి చెప్పేందుకు రేణూదేశాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత అరిచి గోల‌పెట్టినా.. ఎన్నిక‌ల వేళ ఎవ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి ఉండ‌దు. పైగా.. అవ‌త‌ల ఎదుటి పార్టీలు సైతం త‌క్కువైన‌వేం కాదు. జ‌గ‌న్‌కు సైతం బ‌ల‌మైన అభిమాన గ‌ణం ఉంది. చంద్ర‌బాబుకు సైతం అంతే స్థాయిలో అభిమానులున్నారు. వాళ్లు సైతం తిర‌గ‌బ‌డి.. తిట్ట‌డం మొద‌లెడ‌తారు. దీనిని ఎదుర్కోవ‌డం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు క‌త్తిమీద సాములాంటిదే.
ఇటీవ‌ల శ్రీరెడ్డి ఓ మాట అంటేనే.. ప‌వ‌న్ విల‌విల‌లాడిపోయాడు. ఒక్క మాట‌కు ఎంత హ‌డావుడి అయ్యిందో అంద‌రూ చూశారు. కానీ.. అక్క‌డ శ్రీరెడ్డి ఒంట‌రి మ‌హిళ కాబ‌ట్టి.. ఎంత హ‌డావుడి చేసినా చెల్లింది. కానీ.. రాజ‌కీయ వేదిక‌పై ఎదుటి వాళ్లు సైతం బ‌ల‌మైన వాళ్లే. పైగా ప్ర‌స్తుతం ఉన్న సినీ అభిమానులంతా.. తాత్కాలిక‌మే. సినిమాల్లో ప‌వ‌న్ త‌న మేన‌రిజ‌మ్స్ చూపిస్తూ.. పంచ్ డైలాగులు చెప్పేంత వ‌ర‌కే వీరు అభిమానిస్తూ ఉంటారు. అదే సినిమాలు చేయ‌డం ఆపేసి.. జ‌నంలోనికి వ‌చ్చేస్తే.. చాలావ‌ర‌కూ ఇత‌ర హీరోల‌ను వెతుక్కుని వెళ్లిపోతుంటారు. అది.. రామ్‌చ‌ర‌ణ్ కావొచ్చు.. అల్లు అర్జున్ కావొచ్చు. మెగా కోట‌లోని మిగ‌తా హీరోల‌ను ప్ర‌త్యామ్నాయంగా చూసుకుంటారు. చిరంజీవి ఉదంత‌మే దీనికి ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం. చిరంజీవికి ప్ర‌స్తుతం ప‌వ‌న్‌కు ఉన్న దానికంటే రెట్టింపు అభిమానులుండేవారు. ఒక‌సారి సినిమాలు చేయ‌డం ఆపేయ‌గానే.. అభిమాన గ‌ణ‌మంతా.. ప‌వ‌న్ వైపు వెళ్లిపోయారు. చిరంజీవి వ‌స్తున్నార‌న్నా.. ప‌ది మంది కూడా రాని ప‌రిస్థితి విజ‌య‌వాడ‌, రాజ‌మండ్రిల్లో చూశాం. షో ఎలా చూసినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌క్తిగ‌త జీవితం రాజ‌కీయ తెర‌పై ర‌స‌వత్త‌రంగా ప్ర‌ద‌ర్శించ‌డం ఖాయ‌మ‌నే తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -