Thursday, May 16, 2024
- Advertisement -

హేమ‌మాళిని క‌లిసేందుకు బాబు ఢిల్లీ వెల్లారు…!

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడిపై మాట‌ల తూటాలు పేల్చారు. 5 కోట్లు ఆంధ్ర ప్ర‌జ‌ల‌హ‌క్కు ప్ర‌త్యేక‌హోదాకోసం పాండ‌వుల్లాంటి ఐదుగురు ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశార‌ని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని యావత్తు దేశం చూడాలనే ఉద్దేశంతోనే తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేశారని అన్నారు. బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు ఇలా జరిగి ఉండకపోవచ్చ‌న్నారు.

టీడీపీ ఎంపీలు కూడా తమ ఎంపీలతో పాటు రాజీనామా చేసి ఏపీ భవన్ లో నిరాహార దీక్షకు కూర్చుని ఉంటే కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేదని అన్నారు. ఏపీలోనే కాదు ఢిల్లీలో కూడా చంద్రబాబును ఎవరూ నమ్మే పరిస్థితి లేదని, ఇటీవల ఢిల్లీలో పర్యటించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన చంద్రబాబు, ఏపికీ ప్రత్యేక హోదా కావాలని ఎక్కడా ప్రస్తావించలేదని విమర్శించారు.

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ముందు పెట్టింది వైసీపీనేని అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు మళ్లీ మోసం చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. బాబు మోసం చేసినా కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తోడుగా నిలిచేందుకు ఎవరు వచ్చినా, రాకపోయినా అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగడుతూ అన్ని పార్టీలను మా ఎంపీలు కలిశారు. వారందని ఒప్పించి అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టార‌న్నారు.

ప‌నిలో ప‌నిగా బాబు ఏర్పాటు చేయ‌నున్న అఖిల‌ప‌క్షం గుట్టు విప్పారు జ‌గ‌న్‌. ఆయన ఢిల్లీ యాత్ర గురించి చర్చించడానికి అట. బీజేపీ ఎంపీ హేమమాలినిని కలిసి ఏం మాట్లాడారో చెప్పడానికి అట. తన ఢిల్లీ పర్యనటలో రెండు గంటల పాటు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఎక‍్కడా ప్రత్యేక హోదా హోదా గురించి కానీ ఎంపీల రాజీనామాల గురించి ఊసే లేదు. రాష్ట్రానికి మోసం చేసిన చంద్రబాబు అఖిలపక్షానికి వెళ్లాలా? అని బాబుని ప్ర‌శ్నించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -