Wednesday, May 15, 2024
- Advertisement -

చంద్ర‌బాబుకు సూటిగా ఏడు ప్ర‌శ్న‌లు సంధించిన వైఎస్ జ‌గ‌న్‌

- Advertisement -

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ సూటిగా ఏడు ప్ర‌శ్న‌లు సంధించారు. ప్ర‌త్యేక హోదా కోసం పార్టీ ఎంపీలు త‌మ ప‌దువుల‌కు రాజీనామాలు చేసి ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్‌లో ఆమ‌ర‌ణ నిర‌హార‌దీక్ష‌కు దిగిన సంగ‌తి తెలిసందే.

1. మార్చి 2, 2014న యూపీఏ ప్రభుత్వం ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని కేబినెట్ తీర్మానం చేసి ప్లానింగ్ క‌మిష‌న్‌కు పంపింద‌న్నారు. చంద్రబాబు 2014, మేలో అధికారం చేప‌ట్టాక‌కూడా 2014 డిసెంబర్‌ దాకా ఫ్లానింగ్‌ కమిషన్‌ అమలులో ఉందక‌ని ప్ర‌త్యేక హోదాను అమ‌లు చేయండ‌ని ఒక్క సారి కూడా బాబు లేఖ రాయ‌లేద‌న్నారు.

2. సెప్టెంబర్‌ 8, 2016న అర్ధరాత్రి ప్రత్యేక హోదా బదులు సోకాల్డ్‌ ప్యాకేజీ అంటూ కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటన చేసిన‌పుడు దాన్ని స్వాగ‌తింలేదాని ప్ర‌శ్నించారు. ఆ రోజే వ‌ద్ద‌నుంటే ఈ పాటికి ప్ర‌త్యేక‌హోదా వ‌చ్చేద‌న్నారు. అన్ని రాష్ట్రాల విజ్ఞప్తి మేరకే తాము ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు జైట్లీ చెప్పారు.మీరు ఆ ప్యాకేజీ ప్రకటన బ్రహ్మండంగా ఉంది అని స్వాగతించలేదా? ఢిల్లీకి వెళ్లి జైట్లీకి శాలువా కప్పి కృతజ్ఞతలు చెప్పలేదా? సెప్టెంబర్‌9న అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాలు పెట్టి కేంద్రాన్ని, జైట్లీని ప్రశంసించలేదాని ప్ర‌శ్నించారు.

3. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్న ఇదే పెద్ద మనిషి.. ఆ తర్వాత ఆ మాటకు కట్టుబడకుండా అసలు ఆ ఆలోచన వద్దంటూ సలహాలు ఇవ్వలేదా? ఆంధ్ర రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అంటూ ప్రపంచ దేశాలకు కలరింగ్ ఇచ్చారు‌. లక్షల కోట్ల పెట్టుబడులు.. లక్షల్లో ఉద్యోగాలు అంటూ తప్పుడు ప్రకటనలు ఇచ్చారు. దేశంలోనే అత్యధిక జీడీపీ సాధించిన రాష్ట్రమంటూ చెప్పుకున్నారు. ఇది ధర్మమేనా?

4. ప్రత్యేక హోదా మీద చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్న ఒకే ఒక పార్టీ వైఎస్సార్‌ సీపీ మాత్రమే. ఈ నాలుగేళ్లుగా వైఎసార్‌సీపీ వివిధ కార్యక్రమాలకు పిలుపునిస్తే.. పోలీసులను పెట్టి అణిచివేయటం, ప్రతిపక్ష నేత నిరహార దీక్ష చేస్తే ప్రధాని వస్తున్నారంటూ బలవంతంగా భగ్నం చేయలేదాని ప్ర‌శ్నించారు.

5. అసలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గనుక అవిశ్వాసం పెట్టకపోయి ఉంటే.. చంద్రబాబు అవిశ్వాసం పెట్టేవారా?. మార్చి 15 గురువారం సాయంత్రం మీకు సంఖ్యా బలం ఉంటేనే మద్ధతు ఇస్తానని చంద్రబాబు అన్నారు. మార్చి 16 పొద్దున యూటర్న్‌ తీసుకున్నార‌న్నారు.

6. ఇప్పటికిప్పుడు అఖిలపక్షం పేరిట ఆహ్వానాలు పంపుతున్నారు. ఇదేలా ఉందంటే గజదొంగ ఒకడు దొంగతనాల నివారణ కోసం మీటింగ్‌​పెట్టినట్లు ఉంద‌ని ఎద్దేవ చేశారు. ఉద్యమాన్ని ఉవ్వెత్తున్న చేయాల్సిన తరుణంలో ఉద్యమాన్ని నీరుగారుస్తూ ఇలాంటి కార్యచరణ నిర్ణయించటం న్యాయమేనా? ఇది మోసం కాదా

7. ఇవాళ​ పోరాటం చేస్తే ప్రత్యేక హోదా సాధ్యం అవుతుందని తెలిసి కూడా. ఇది ఆఖరి బడ్జెట్‌ సమావేశం అని తెలిసి కూడా. అన్నింటికి మించి 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేస్తే ఖచ్ఛితంగా దేశం మొత్తం మనవైపు చూస్తుంది. కేంద్రం దిగి వస్తుందని తెలిసి కూడా ఈరోజుకీ కూడా తన ఎంపీలతో రాజీనామాలు చేయించకుండా డ్రామాలాడటం మోసం కాదాని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -